
Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో!
ఈ వార్తాకథనం ఏంటి
ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు.
కానీ ఈరోజు సమాజంలో చాలా మంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటంటే... ఇతరుల్ని నమ్మడం. ఎవరో వచ్చి, మనకి ఏదో చేస్తారని ఆశపడుతూ కాలం వృథా చేస్తుంటారు.
"మనవాడే కదా... నాకు ఏదైనా చేస్తాడు" అనుకునే వింత నమ్మకంతో కాలం కోల్పోతారు. కానీ నిజం ఏమిటంటే, ఎదగాలనుకునే వారు ఎక్కువగా మిమ్మల్ని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారు.
మీకోసం ఏదైనా చేయాలనే ఆలోచన చాలా అరుదు. అందుకే అవకాశాల కోసం ఎదురుచూడకండి. అవకాశాలను మీరు సృష్టించుకోవాలి.
Details
ఇతరుల మీద ఆధారపడకూడదు
ఎందుకంటే గొప్పగా ఎదిగిన వారంతా తమ చుట్టూ వాళ్లకోసం పని చేసే వారిని పెంచుకున్నారు. వారు ఎదగడానికి మీరు వేదికగా మారిపోతారు. ఆ నిజం అర్థమయ్యేలోపు జీవితం గడిచిపోతుంది.
అందుకే, ముందుగా మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారన్న ఆశ వదిలేయండి. మీరు మాత్రమే మీ కోసం పోరాడాలి. మీ గెలుపు కోసం మీరు నిలబడాలి.
భయంతో చేసే పనులకు జీవితంలో పెద్దగా ఫలితాలు ఉండవు. తెలివితో, ధైర్యంతో చేయబడిన పనులు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి.
ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతి సారి మనల్ని మనం నమ్ముకున్నప్పుడు విజయం మన వెంటే ఉంటుంది. కానీ ఇతరుల మీద ఆధారపడినప్పుడల్లా, చివరకు మేమే బాధపడాల్సి వస్తుంది.
Details
అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్‌ను వదిలి బయటకు రావాలి
ఈరోజు మీరు ఎవరికోసం వృథా చేస్తున్న ప్రతి నిమిషం... రేపు మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.
మీరు ఉద్యోగం చేస్తున్న ఒక సంస్థలో ఎదగాలనుకుంటే, ఆ సంస్థ మాత్రం మీరు అక్కడే ఉండేలా మీ ఆలోచనలను పరిమితం చేస్తుంది.
దాంతో మీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే, అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్‌ను వదిలి బయటకు రావాలి. దీని కోసం మీకు ధైర్యం, మీపై నమ్మకం అవసరం.
అదే ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. ఏదైనా మీరు ప్రారంభించబోయే ముందు అందరూ నవ్వుతారు. తర్వాత వ్యంగ్యంగా మాట్లాడతారు.
కానీ మీరు గెలిచాక, అదే వాళ్లు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇదే నిజం. ఈ జీవితంలో సాధ్యంకాని పని అంటూ లేదు.
Details
నమ్మకం ఉండాలి
మొదలుపెట్టడమే అసలు విజయం దిశగా మొదటి అడుగు. కేవలం "నమ్మకం" అనే బలమైన పునాది మీద కష్టపడితే విజయం తప్పదు.
మీరు మీపై అనుమానం పెట్టుకుంటే ఏమీ సాధించలేరు. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి.
"నన్ను నేను నమ్ముకున్న ప్రతీసారి విజయం నా దారి తొడిగింది...
ఇతరులపై ఆధారపడిన ప్రతీసారి బాధ నన్నే పట్టుకుంది.
చివరకు అర్థమైంది... స్వశక్తిని మించిన ఆస్తి ఈ లోకంలో లేదని."
భయంతో జీవిస్తే బతకలేరు. ముందుకు వెళ్లాలంటే తప్పో... ఓప్పో ముందుగా ప్రయత్నించాలి. గెలిచితే అది విజయాన్ని అందిస్తుంది.
ఓడిపోతే, అది ఏం నేర్చుకోవాలో చూపిస్తుంది.
Details
నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకుసాగాలి
ఇతనేమంటాడో, అతనేమంటాడో కాదు...
నువ్వేమనుకుంటావో, అదే చేద్దాం!
నీ కష్టం నీకే ఆనందం, బాధ నీకే పాఠం. ఎవరూ నీకోసం ఏమీ చేయరు. జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వు ముందుకు సాగితే... ప్రకృతి నీకు దారి చూపుతుంది. విజయపు వెలుగులు నీ దిశగా ప్రయాణిస్తాయి.