LOADING...
Power Tips: కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఇంట్లో ఈ 6 అలవాట్లు వెంటనే మార్చండి
కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఇంట్లో ఈ 6 అలవాట్లు వెంటనే మార్చండి

Power Tips: కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఇంట్లో ఈ 6 అలవాట్లు వెంటనే మార్చండి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంట్లో అవసరం లేకపోయినా చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్‌లోనే ఉంచుతుంటారు. దీని వల్ల తెలియకుండానే విద్యుత్ వినియోగం పెరిగి కరెంట్ బిల్లు అధికంగా వస్తుంది. ముఖ్యంగా కొన్ని పరికరాలు ఆఫ్ చేసినట్టే కనిపించినా, అవి స్టాండ్‌బై మోడ్‌లో కొనసాగుతూ విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటాయి. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే మన రోజువారీ అలవాట్లలో చేసే చిన్న పొరపాట్లే ఇందుకు ప్రధాన కారణమవుతాయి. ఇంట్లో ఉపయోగించే టీవీలు, ఛార్జర్లు, సెట్‌టాప్ బాక్స్‌లు వంటి పరికరాలు పూర్తిగా ఆఫ్ చేయకపోతే స్టాండ్‌బై మోడ్‌లో విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటాయి. కొన్ని సర్వేల్లో ఆరు వరకు గాడ్జెట్లు స్టాండ్‌బై మోడ్‌లో కూడా కరెంట్‌ను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది.

వివరాలు

టీవీని రిమోట్ ద్వారా ఆఫ్ చేయకూడదు

చాలామంది టీవీని రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తారు. కానీ అలా చేయడం వల్ల టీవీ పూర్తిగా ఆఫ్ కాకుండా స్టాండ్‌బై మోడ్‌లోకి మారుతుంది. స్క్రీన్ ఆఫ్ అయినా, లోపల బ్యాక్‌ఎండ్ సిస్టమ్ విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. అందుకే టీవీని ఉపయోగించిన తర్వాత మెయిన్ పవర్ స్విచ్‌ను కూడా ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా సెట్‌టాప్ బాక్స్‌లను కూడా కేవలం రిమోట్‌తో ఆఫ్ చేయకుండా మెయిన్ స్విచ్ నుంచి పూర్తిగా ఆఫ్ చేయాలి. లేదంటే అవి కూడా స్టాండ్‌బై మోడ్‌లో ఉండి కరెంట్‌ను వినియోగిస్తాయి.

వివరాలు

ఛార్జింగ్ పూర్తైన వెంటనే ఛార్జర్‌ను సాకెట్ నుంచి తొలగించాలి

మొబైల్ లేదా ఇతర పరికరాల ఛార్జర్లను ఉపయోగించిన తర్వాత చాలామంది ప్లగ్‌ను సాకెట్‌లోనే ఉంచేస్తారు. ఇది కూడా విద్యుత్ వృథాకు కారణమవుతుంది. కాబట్టి ఛార్జింగ్ పూర్తైన వెంటనే ఛార్జర్‌ను సాకెట్ నుంచి తొలగించడం మంచిది. ఏసీ విషయంలో కూడా ఇదే జాగ్రత్త అవసరం. చాలామంది రిమోట్‌తో ఆఫ్ చేస్తే సరిపోతుందని భావిస్తారు. కానీ రిమోట్‌తో ఆఫ్ చేసిన తర్వాత కూడా ఏసీలోని ఇంటర్నల్ సర్క్యూట్ స్టాండ్‌బై మోడ్‌లో పనిచేస్తూనే ఉంటుంది. అందుకే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయడం ద్వారా అదనపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

చిన్న చిన్న జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే

ఇంటర్నెట్ అవసరం లేని సమయంలో వైఫై రౌటర్‌ను కూడా ఆఫ్ చేయడం మంచిదే. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే సమయంలో లేదా ఇంటి బయటకు వెళ్లేటప్పుడు రౌటర్ స్విచ్‌ను ఆఫ్ చేస్తే కరెంట్ ఆదా అవుతుంది. అలాగే ఇంట్లో ఉపయోగించే వాటర్ ప్యూరిఫైయర్‌ను కూడా అవసరం లేని సమయంలో ఆఫ్ చేయాలి. ముఖ్యంగా ఆర్‌వో ట్యాంక్ పూర్తిగా నిండిన తర్వాత, అందులోని నీరు తగ్గే వరకు పవర్ ఆఫ్ చేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నెలవారీ కరెంట్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Advertisement