
మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వీగనిజం ఇప్పుడు పాపులర్ ట్రెండ్ గా మారిపోయింది. వీగన్స్ వేగంగా పెరిగిపోతున్నారు.
ఇంతకీ వీగనిజం అంటే ఏమిటి? మీ ఇంటికి వీగన్స్ అతిథులుగా వస్తే ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
వీగనిజం అంటే? సాధారణంగా శాఖాహారులు అంటే మాంసం తినని వారని అర్థం.
అలాగే జంతువుల నుండి తయారైన ఎలాంటి వస్తువులను వీళ్ళు వాడరు. తినరు.
మాంసాహారంతో పాటు జంతు సంబంధిత పదార్థాలు కలిసిన ఆహారాలను ముట్టుకోని వాళ్లను, అలాంటి వస్తువులను వాడని వాళ్లను వీగన్స్ అంటారు.
Details
చనా మసాలా
నార్త్ ఇండియా కు చెందిన వంటకమైన చనా మసాలా పూర్తిగా వీగన్ పదార్థాలతో తయారవుతుంది.
బఠానీ గింజలు, వెల్లుల్లి, టమాట, అల్లం, ఉల్లిపాయ ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఈ కూరను తయారుచేస్తారు.
వీగన్స్ కోసం వండేటప్పుడు దీనిలో నెయ్యి వేయకుండా ఏదైనా మొక్కలకు సంబంధించిన నూనెతో తయారు చేయడం మంచిది. కూర తయారయ్యాక పూరి చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
మసాలా దోస:
మసాలా దోశ పూర్తిగా శాకాహారంతో తయారవుతుంది. దీనికోసం పప్పులు, బంగాళదుంప, ఉల్లిపాయ ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అవసరం అవుతాయి.
దోస రెడీ అయ్యాక వేరుశనగలతో చేసిన చట్నీ ఇంకా సాంబార్ తో హ్యాపీగా ఆరగించవచ్చు.
Details
గారెలు
సౌత్ ఇండియాలో గారెలు చాలా ఫేమస్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గారెలు తినడం చాలామందికి అలవాటు. వీటిని వడలు అని కూడా అంటారు.
పప్పులతో గారెలు తయారుచేసి వేరుశెనలతో చేసిన చట్నీ, సాంబారుతో గారెలను ఆరగించవచ్చు.
తెప్ల:
గుజరాతి వంటతమైన తెప్లాను గోధుమపిండి, శనగపిండి, పసుపు, కారం, జీలకర్ర, మెంతి ఆకులు కలిపి పిండి తయారు చేస్తారు.
ఈ పిండితో రొట్టెలు చేసి చట్నీ లేదా పచ్చడితో ఆరగిస్తారు. ఇందులో మెంతి ఆకులు ప్రధాన ఆహార పదార్ధంగా ఉంటుంది కాబట్టి వీటి రుచి కొత్తగా ఉంటుంది.