బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆకలిగా ఉన్నట్టు కొందరికి అనిపిస్తుంటుంది. దానికి కారణం కావలసినంత ఫైబర్ తీసుకోకపోవడమే. కావాల్సినంత ఫైబర్ తీసుకోవడం వల్ల ఆకలి తొందరగా కాకుండా ఉంటుంది. ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. పోహా: పోహాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో పోహాను కచ్చితంగా చేర్చుకోవాలి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో పోహ చాలా సాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, ప్రోబయోటిక్స్ ఇంకా విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే సూపర్ ఫుడ్
క్వినోవా: క్వినోవాను సూపర్ ఫుడ్ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. క్వినోవాతో దోస, సలాడ్, బ్రెడ్ చేసుకుని ఆరగించవచ్చు. జొన్న దోస: జొన్నల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. జొన్న దోసను తినడం వల్ల పది క్యాలరీల శక్తి వస్తుంది. జొన్న దోసను తినడం వల్ల కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దాని వల్ల తక్కువ తింటారు. మరో విషయం ఏంటంటే జొన్నదోస వల్ల జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. దాలియా: హై బీపీ, ఊబకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తినవచ్చు. గోధుమ, బియ్యాన్ని కలిపి దీన్ని తయారు చేయవచ్చు లేదా చిరుధాన్యాలను కలిపి దీన్ని తయారుచేస్తారు.