Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేసే అలవాటు మీకుందా? మీరు బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఒక వాహనానికి ఇంధనం ఎలాగో మనిషికి బ్రేక్ ఫాస్ట్ అలా అన్నమాట. ఇంధనం లేకపోతే వాహనం కదలలేనట్టే ఉదయం లేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మనిషి సరిగ్గా పనిచేయలేడు. ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ ఎందుకు తీసుకోవాలో, తినకపోతే వచ్చే నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అలసట కలుగుతుంది: ఉదయం ఆహారం తినకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మీరు అలసటగా ఫీల్ అవుతారు.
బ్రేక్ ఫాస్ట్ తో మెదడుకు శక్తి
మెదడును ఉత్తేజపరిచే బ్రేక్ ఫాస్ట్: పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మెదడుకు శక్తి అందుతుంది. ఏదైనా నిర్ణయాన్ని తొందరగా తీసుకోగలుగుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మెదడుకు సరైన పోషకాలు అందక సరిగ్గా ఆలోచించలేక పోతుంది. జీవక్రియను ఆరోగ్యంగా ఉంచే బ్రేక్ ఫాస్ట్: జీవక్రియ సరిగ్గా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలు సరిగ్గా అందాలి. మీరు బ్రేక్ ఫాస్ట్ తినకపోతే శరీరానికి సరైన పోషకాలు అందకుండా జీవక్రియ దెబ్బ తింటుంది. చక్కెర స్థాయిలను నియంత్రించే బ్రేక్ ఫాస్ట్: ముందుగా చెప్పుకున్నట్టు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉండి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.