Lung Health: చలికాలంలో మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి 5 యోగా ఆసనాలు
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడే డయాఫ్రాగ్మాటిక్ శ్వాస వంటి లోతైన శ్వాస పద్ధతులను యోగా నొక్కి చెబుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని యోగా భంగిమలు సైనస్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ భంగిమలు నాసికా మార్గాల ద్వారా చేరి శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ భంగిమలు ఛాతీ, వెనుక, కండరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయి, భంగిమ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఛాతీ,వెనుక భాగంలోని బలమైన కండరాలు ఊపిరితిత్తుల విస్తరణలో సహాయపడతాయి.
యోగా వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
శీతాకాలం తరచుగా జలుబు, ఫ్లూ, కాలానుగుణ అలెర్జీలను తెస్తుంది.దింతో అవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. యోగా ఒత్తిడిని తగ్గించడానికి,రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులకు తక్కువ అవకాశం కల్పిస్తుంది. రెగ్యులర్ యోగాభ్యాసం రక్త ప్రసరణను పెంచుతుంది. ఆక్సిజన్, పోషకాలు శ్వాసకోశ వ్యవస్థతో సహా శరీరంలోని అన్ని భాగాలకు సమర్ధవంతంగా రవాణా చేయబడేలా నిర్ధారిస్తుంది. మెరుగైన ప్రసరణ ఊపిరితిత్తుల పనితీరు,శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో మీ శ్వాసకోశ ఆరోగ్యానికి ఏ యోగాసనాలు సహాయపడతాయో,ఈ ఆసనాలను ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే యోగా ఆసనాలు:
1. భుజంగాసనం ముందుగా ఆసనం చేసేందుకు బోర్లా పడుకోవాలి. ఇప్పుడు, అరచేతులని భుజాల క్రింద నేలపై పెట్టాలి. చేతులని కిందికి నెడుతూ తలని మెల్లిగా పైకి లేపాలి. ఈ సమయంలో, నడుము భాగాన్ని పైకి వంచాలి. దీని వల్ల నడుము భాగం బలంగా తయారవుతుంది. ఇలా 30 సెకన్ల పాటు ఉంచి విడుదల చేయండి. ఇది ప్రతిరోజూ 3-4 సార్లు రిపీట్ చేయండి.
2. ఉస్త్రాసనం (క్యామెల్ పోజ్)
ఉష్ట్రాసనం చేసేటప్పుడు ముందుగా నిటారుగా నిలబడాలి. తర్వాత వజ్రాసనం మీద కూర్చోండి. ఆ తర్వాత రెండు చేతులను తుంటిపై ఉంచండి. తర్వాత మోకరిల్లి మెల్లగా వెనక్కు వచ్చి కుడిచేత్తో కుడి కాలు చీలమండను, ఎడమ చేతితో ఎడమ కాలు చీలమండను పట్టుకోవాలి. ఆ తర్వాత వెనక్కి వెళ్లండి. వెన్నెముకను వీలైనంత ముందుకు నెట్టడానికి ప్రయత్నించండి. 10-20 సెకన్ల పాటు అలాగే ఉండండి .ఇది ప్రతిరోజు 3-5 నిమిషాల పాటు పునరావృతం చేయండి.
3. సేతు బంధాసనం
ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి.. పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు బేస్ చేసుకుని.. నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపై ఉండాలి. ఈ పొజిషన్‌లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి. సాధారణ స్థితికి తిరిగి వచ్చే ముందు 4-8 సార్లు శ్వాసను పీల్చండి.
4. ధనురాసనం
ధనురాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. అలా పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి.
5. శవాసనం
చదునైన నేలపై పడుకోండి, యోగా చాపఅయితే మరి మంచిది. మీ చేతులను ఫ్రీ గా ఉంచండి అలాగే మీ అరచేతులు తెరవండి. మీ అరచేతులు ఆకాశం వైపు తెరిచి ఉండేలా చూసుకోండి. మీ కాళ్లు మీ భుజాల కంటే కొంచెం దూరంగా ఉండాలి. ఈ సమయంలో, ఊపిరి పీల్చుకోండి