మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు
మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీకెలా అర్థమవుతుందో మీరెప్పుడైనా గమనించారా? రోజువారి జీవితంలో ఉరుకుల పరుగుల ఉద్యోగాల్లో ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెక్ చేసుకునే సమయం కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పటి నుండి సమయాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని వ్యాధులు తెలియకుండానే మిమ్మల్ని వాటి కంట్రోల్ లోకి తీసేసుకుంటాయి. మనస్సు, శరీరం ఆహ్లాదంగా ఉన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అలాంటి అమోఘమైన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చెప్పుకోదగ్గ కొన్ని మూలికలు.. మనసుకు, శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వాటిని మీ రోజువారి డైట్ లో చేర్చుకోండి.
ఆరోగ్యం కోసం ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆయుర్వేద పదార్థాలు
త్రిఫల: మూడు ఫలాల మిశ్రమంతో తయారైన ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల మలబద్దకం, తీవ్రమైన జ్వరం, అజీర్తి మొదలగు సమస్యలు రాకుండా ఉంటుంది. వేడినీటిలో త్రిఫల చూర్ణం వేసుకుని తాగితే సరిపోతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీర కణాల్లో మిగిలిపోయిన విషాలను బయటకు పంపివేస్తాయి. అశ్వగంధ: శరీరంలోని కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపివేస్తుంది. అరగ్లాసు పాలలో అశ్వగంధను కలుపుకుని తాగితే మంచిది. తిప్పతీగ: శ్వాసకోస సంబంధ వ్యాధులు రాకుండా ఉంచుతుంది. కాలేయ సంబంధ రోగాలను దూరం పెడుతుంది. దీన్ని జ్యూస్ చేసుకుని రోజూ ఉదయం సేవించడం ఉత్తమం.