LOADING...
Ice Creams: ఈ ఐస్‌క్రీమ్స్ రుచి చూశారా? ప్రపంచ టాప్-100లో నిలిచిన ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్లు
ఈ ఐస్‌క్రీమ్స్ రుచి చూశారా? ప్రపంచ టాప్-100లో నిలిచిన ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్లు

Ice Creams: ఈ ఐస్‌క్రీమ్స్ రుచి చూశారా? ప్రపంచ టాప్-100లో నిలిచిన ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్లు

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలం ప్రారంభమైతే చాలు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తొచ్చేది చల్లని ఐస్‌క్రీమ్‌నే. తీపి రుచులతో మనసును కట్టిపడేసే ఈ డెజర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. ప్రముఖ ఫుడ్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' నిర్వహించిన తాజా సర్వేలో ప్రపంచంలోని "100 అత్యంత ప్రసిద్ధ ఐస్‌క్రీమ్స్" జాబితాలో భారతదేశానికి చెందిన ఐదు ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్లు స్థానం సంపాదించాయి. ఇటలీ గెలాటేరియాలు అగ్రస్థానాల్లో నిలిచినా, భారతీయ బ్రాండ్లు తమ ప్రత్యేకమైన సహజ రుచులతో అంతర్జాతీయ గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది.

వివరాలు

ప్రత్యేక రుచులతో ఐస్ క్రీమ్స్

ఈ జాబితాలో ముంబైకి చెందిన కె. రుస్తుం అండ్ కో, అప్సర ఐస్‌క్రీమ్స్, నేచురల్స్ ఐస్‌క్రీమ్స్‌తో పాటు బెంగళూరులోని కార్నర్ హౌస్, మంగళూరులోని పబ్బాస్ కూడా చోటు దక్కించుకున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్లర్లు కేవలం ఐస్‌క్రీమ్స్ అమ్మే ప్రదేశాలు మాత్రమే కాదు.. వినూత్నమైన రుచులతో ప్రత్యేకమైన అనుభూతిని అందించే కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి పార్లర్‌కు ఒక ప్రత్యేక స్టైల్, వినియోగదారులను ఆకట్టుకునే సిగ్నేచర్ ఫ్లేవర్ ఉండటమే వీటి ప్రత్యేకత. ఇప్పుడు ఆ ఐకానిక్ ఐస్‌క్రీమ్ సెంటర్ల ప్రత్యేక రుచుల గురించి తెలుసుకుందాం.

వివరాలు

ముంబైలో ప్రసిద్ధి చెందిన ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌లు..

ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో 1953లో ప్రారంభమైన 'కె. రుస్తుం అండ్ కో' తన ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పలుచని వేఫర్ల మధ్య ఐస్‌క్రీమ్‌ను ఉంచి అందించే వీరి స్టైల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడి మ్యాంగో ఫ్లేవర్ ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. వాల్‌నట్ క్రంచ్, కేసర్ పిస్తా వంటి రుచులు కూడా తప్పక ఆస్వాదించాల్సినవే. అలాగే, 1971లో వాకేశ్వర్‌లో ప్రారంభమైన 'అప్సర ఐస్‌క్రీమ్స్' తన ప్రత్యేక జామకాయ ఐస్‌క్రీమ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

Advertisement

వివరాలు

జామకాయ ముక్కలతో ఐస్ క్రీమ్ ఫేమస్..

తాజా జామకాయ ముక్కలతో పాటు ప్రత్యేక మసాలా కలిపి అందించే ఈ రుచి వినియోగదారులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఇక్కడ పానీ పూరి, బ్లూబెర్రీ చీజ్‌కేక్ వంటి విభిన్న ఫ్లేవర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ముంబైకి వెళ్లినవారిలో 'నేచురల్స్ ఐస్‌క్రీమ్'లోని టెండర్ కోకోనట్ రుచి చూడని వారు చాలా అరుదు. 1984లో ప్రారంభమైన ఈ బ్రాండ్ తాజా పండ్లు, సహజ పదార్థాలతో తయారుచేసే ఐస్‌క్రీమ్స్‌కు ప్రసిద్ధి చెందింది. సీతాఫల్, అంజూర్ వంటి సీజనల్ ఫ్రూట్ ఫ్లేవర్లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Advertisement