ప్రపంచ వంటకాల్లో ఇండియాకు ఐదో స్థానం.. ఒప్పుకోం అంటున్న నెటిజన్లు
ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి. దేని రుచి దానిదే. భోజన ప్రియులకు వేరు వేరు రకాల విభిన్న ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశ వంటకాలకు ఎక్కువ రుచి ఉంది, ఏ దేశ వంటకాలను ఎక్కువ ఆదరిస్తారు. ఏ దేశ వంటకాలను ఎక్కువ తినడానికి ఇష్టపడతారు అన్న విషయాలపై టేస్ట్ అట్లాస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం భారతదేశానికి ఐదవ స్థానం లభించింది. ఇటలీ మొదటి స్థానంలో, గ్రీస్, స్పెయిన్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. నాలుగవ స్థానంలో జపాన్ ఉంది. ఈ లిస్ట్ తయారు చేయడానికి ఆన్ లైన్ సర్వే చేపట్టింది టేస్ట్ అట్లాస్.
ఫైర్ అవుతున్న నెటిజన్లు
వంటకాలు, వంటకంలో వేసే పదార్థాలు, డ్రింక్స్ ని కూడా పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. ఇండియాలో గరమ్ మసాలా, మీగడ, నెయ్యి, కీమాను టేస్ట్ చేయాలని లిస్ట్ లో చూపించింది. అంతేకాదు ఏయే ప్రాంతాంలో టేస్ట్ చేస్తే బాగుంటుందో కూడా తెలిపింది. ఇండియాలో మొత్తం 464 ప్రాంతాలను సెలెక్ట్ చేసింది. ఐతే ఈ లిస్ట్ పై నెటిజన్లు కోపం తెచ్చుకుంటున్నారు. దాదాపు అన్ని దేశాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇండియాకు ఐదో స్థానం కాదు అంతకంటే మెరుగైన స్థానం రావాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో లిస్ట్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదని చెబుతున్నారు. ఏదో సాధారణంగా జాబితాను తయారు చేసారని, అందులో వాస్తవికత లేదని అంటున్నారు.