Navy Day 2025 : సముద్ర భద్రతకు ప్రతీక.. భారత నౌకాదళం.. వారి ప్రధాన విధులు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర మార్గం ద్వారా భారత్‌పై జరిగే ఎలాంటి దాడినైనా అడ్డుకోవడం భారత నావికాదళం ప్రధాన బాధ్యత. దేశ భద్రతకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చే విదేశీ నౌకలు, జలాంతర్గాములను భారత నేవీ ఎన్నో సందర్భాల్లో వెనక్కి నెట్టింది. ఈ సామర్థ్యానికి చారిత్రక సాక్ష్యం 1971లో పాకిస్థాన్‌పై సాధించిన ఘన విజయం. ఆ యుద్ధంలో భారత నావికాదళం పోటీకి తగ్గ సమాధానం ఇవ్వడంతో దేశం గర్వించదగిన విజయం సాధించింది. ఆ విజయ స్మృతిగా ప్రతి సంవత్సరం ఇండియాలో ఇండియన్ నేవీ డేని ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున నేవీ అంటే ఏమిటి? దాని విధులు ఏంటి? దేశానికి అందిస్తున్న సేవలు ఏంటో చూసేద్దాం.
వివరాలు
నేవీ అంటే ఏమిటి?
భారత నావికాదళం దేశ సముద్ర సరిహద్దులను రక్షించే కీలక సాయుధ దళం. ఏ దేశానికైనా నేవీ అనేది అత్యంత అవసరమైన రక్షణ శక్తిగా పరిగణిస్తారు. రాజరికాల కాలం నుంచే నావికాదళాన్ని శక్తివంతమైన దళంగా గుర్తించేవారు. నేటి కాలంలో భారత నావికాదళం ప్రపంచంలోనే అగ్రస్థాయి ఫోర్సెస్‌లో ఒకటిగా నిలిచింది. భారత సముద్ర సరిహద్దుల వైపు కన్నెత్తి చూడలేరని అనేకసార్లు నిరూపించింది. అయితే 'NAVY' అనే పదానికి పూర్తి అర్థం చాలామందికి తెలియదు. NAVY అంటే Nautical Army of Volunteer Yeomen అని అర్థం. ప్రతి అక్షరానికి ఒక విశేషమైన అర్థం ఉన్నా, వాటిని కలిపే మనం సాదారణంగా ఒకే పదంగా 'నేవీ'గా వ్యవహరిస్తాము.
వివరాలు
భారత నావికాదళ ప్రాముఖ్యత
భారతదేశ సాయుధ బలగాల్లో నావికాదళానికి కీలక స్థానం ఉంది. దేశ సముద్ర సరిహద్దుల రక్షణతో పాటు, సముద్ర మార్గాల ద్వారా జరిగే వాణిజ్యం, వనరుల పరిరక్షణ వంటి ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నేవీ డేఖని ప్రతి ఏడాది భారత నావికాదళం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటుంది. దేశ రక్షణ పట్ల తన నిబద్ధతను ప్రజలకు తెలియజేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజున నావికాదళ స్థావరాలు, నౌకలపై వేడుకలు జరుగుతాయి. విధులకు అంకితమైన నావికులను సత్కరించి, వారి సేవలను దేశం ముందుకు తీసుకువస్తారు.
వివరాలు
భారత నావికాదళ ప్రధాన విధులు
భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ దేశ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ, రక్షణ చర్యల్లో పాల్గొనడం అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రతకు తోడ్పాటు అందించడం
వివరాలు
నేవీ డే ప్రాముఖ్యత
నేవీ డేను దేశానికి సేవ చేసి ప్రాణాలను అర్పించిన, అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న ధైర్యవంతులైన నావికులను స్మరించుకునే రోజు గా జరుపుకుంటారు. ఇది మన భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసిన వీరులను గుర్తు చేసుకునే గొప్ప సందర్భం. ఈ వేడుకల్లో భాగంగా అద్భుతమైన నావికా కవాతు ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక నావికా సాంకేతికతను ప్రదర్శించి సముద్ర భద్రత ఎంత ముఖ్యమో తెలియజేస్తారు. ప్రపంచంలోని అగ్ర 10 నావికాదళాలలో భారత నావికాదళం ఏడవ స్థానంలో నిలిచింది. దక్షిణ ఆసియా ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన నౌకాదళంగా గుర్తింపు పొందడం మన దేశ గర్వకారణం.
వివరాలు
భారత సాయుధ దళాలు
భారతదేశ సాయుధ బలగాలు మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి - భారత సైన్యం (ఆర్మీ), భారత వైమానిక దళం, భారత నావికాదళం. భారత సైన్యం భూ మార్గంలో జరిగే దాడుల నుంచి దేశాన్ని కాపాడుతుంది. నావికాదళం సముద్రం నుంచి వచ్చే ప్రమాదాలను అడ్డుకుంటుంది. వైమానిక దళం గగనతలంలో ఎదురయ్యే ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తుంది. వీటన్నింటికి వేర్వేరు బాధ్యతలు ఉన్నా, ఒకే లక్ష్యం - భారతదేశ రక్షణ అన్నది ప్రతి దళం ఉమ్మడిగా అనుసరిస్తోంది.