
International Labour Day 2025: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున మీ సహద్యోగులకు శుభాకాాంక్షలు చెప్పండిలా..
ఈ వార్తాకథనం ఏంటి
మే 1 అంటేనే మేడే.ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుపుకునే కార్మిక దినోత్సవం.
ఈ రోజుకు పునాది పడింది 1886లో అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన హే మార్కెట్ ఉద్యమంతో.. ఆ సమయంలో కార్మికులు ఎనిమిది గంటల పని సమయాన్ని కోరుతూ ఆందోళన చేపట్టారు.
1886 మే 1న ఈ ఉద్యమం ప్రారంభమైంది.ఉద్యమానికి మద్దతుగా మే 4న హే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు జమయ్యారు.
అయితే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీసి, పోలీసులు కాల్పులు జరపడంతో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
కార్మికుల త్యాగాన్ని గుర్తించేందుకు మే 1ను కార్మిక దినోత్సవం
ఈసంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు బీజం వేసింది.
హే మార్కెట్ ఘటనలో ప్రాణాలు విడిచిన కార్మికుల త్యాగాన్నిగుర్తించేందుకు మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
అప్పటి నుంచి మేడే ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పొందింది. ఎన్నో దేశాల్లో ఈ రోజున కార్మికులు ర్యాలీలు,నిరసనల ద్వారా తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తూ వస్తున్నారు.
భారతదేశంలో మేడే తొలిసారి 1923లో నిర్వహించారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది మే 1ను దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఇటీవల కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
ఈ కష్ట సమయంలో వారికి మనం ధైర్యం ఇవ్వాలి.ఆశను నింపాలి.ఈ సందర్భంలో కొన్ని శక్తివంతమైన సందేశాల ద్వారా కార్మికుల మనోబలాన్ని పెంచేద్దాం.
వివరాలు
శక్తివంతమైన మేడే సందేశాలు:
కార్మికులు తమ హక్కుల కోసం ప్రాణాలే అర్పించి సాధించుకున్న గొప్ప విజయ దినం ఈ మేడే. శ్రామిక సోదరులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు.
"మరో ప్రపంచం పిలుస్తోంది... ముందుకు సాగుదాం... పోరాట పతాకం ఎగరవేద్దాం!" శ్రామిక శక్తికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రమే మన జీవనాధారం, శ్రమే లక్ష్యం. శ్రమే భవిష్యత్తును నిర్మించే శక్తి. శ్రమే దైవం. శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు.
చెమట చిందించిన ప్రతి కార్మికునికి గౌరవం చెందాలి. శ్రమను గౌరవించాలి. కలిసికట్టుగా హక్కుల కోసం పోరాడాలి. శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు.
వివరాలు
శక్తివంతమైన మేడే సందేశాలు:
ఇది కష్టకాలం. కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయినా, ధైర్యంగా ముందుకు సాగుదాం. రేపటి బాగుపై నమ్మకంతో పని చేద్దాం. మే డే శుభాకాంక్షలు.
కార్మికుల చెమటకష్టం బంగారానికి తాకదు. అది వజ్రాల కన్నా వెలుగు, ముత్యాల కన్నా అందం కలిగి ఉంటుంది. శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు.
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి,రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం.
కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి శ్రామికునికి మనఃపూర్వక నమస్సులు.