అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స
ప్రతీ ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ దినోత్సవాన్ని జరుపుతారు. మోనోశాకరైడోస్ టైప్ 1 అనే వ్యాధిని అర్థం చేసుకోవడానికి, చికిత్స వివరాలను తెలుసుకోవడానికి ఈరోజును జరుపుతారు. ఎం.పీ.ఎస్ అంటే: జీవక్రియల్లో లోపాలు ఏర్పడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. శరీరంలోని చక్కెర కార్బోహైడ్రేటులను విడగొట్టడానికి ఎంజైములు అవసరం అవుతాయి. ఆ ఎంజైముల లోపం ఏర్పడటాన్నే ఎం.పీ.ఎస్ అంటారు. ఈ కారణంగా చర్మ కణజాలాలు నాశనమవుతాయి. భౌతికంగా తేడాలు ఏర్పడతాయి. అవయవాలు సరిగ్గా పనిచేయవు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎం.పీ.ఎస్ రకాలు: హర్లర్ సిండ్రోమ్ (ఎంపీఎస్ 1), హంటర్ సిండ్రీమ్(ఎంపీఎస్ 2), సాన్ఫిలిప్పో(ఎంపీఎస్ 3), మార్కియో(ఎంపీఎస్ 4), మారోటాక్స్ లామీ సిండ్రోమ్(ఎంపీఎస్ ), స్లై సిండ్రోమ్(ఎంపీఎస్ 6) రకాలు ఉన్నాయి.
ఎం.పీ.ఎస్ వ్యాధి రావడానికి కారణాలు
తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధి పిల్లలకు వస్తుంది. జన్యువుల్లోని మార్పుల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపాడే వారిలో లైసోసోమాల్ ఆల్ఫా - ఎల్- ఇడ్యురోనిడేస్ అనే చక్కెర కార్బోహైడ్రేటులను విడగొట్టే ఎంజైమ్ లోపం ఉంటుంది. లక్షణాలు: కీళ్ళ దగ్గర మెత్తని ముద్దల్లాగా వాపులు, ముఖంలో మార్పులు, కణజాలాల్లో గడ్డలు ఏర్పడటం కలుగుతుంది. అలాగే నడుము కిందభాగంలో ఎక్స్ రే తీసినపుడు కటిభాగపు ఎముక అరిగినట్లుగా కనిపించవచ్చు. చికిత్స: ఎంపీఎస్ ను గుర్తించడానికి మూత్రపరీక్ష చేస్తారు. మూత్రంలో మ్యూకోపాలిశాకరైడ్ ల స్థాయిని బట్టి గుర్తిస్తారు. ఒకవేళ ఎంజైమ్ లోపం ఉన్నట్లయితే, ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ, హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్ ప్లాంటేషన్ ద్వారా చికిత్స చేస్తారు.