
చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియంలను తప్పకుండా సందర్శించండి
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈ సందర్భంగా భారతదేశంలోని చెప్పుకోదగ్గ మ్యూజియంల గురించి తెలుసుకుందాం.
నేషనల్ మ్యూజియం - ఢిల్లీ:
1949లో ఢిల్లీలో జనపథ్ ప్రాంతంలో ఈ మ్యూజియంను నిర్మించారు. ఈ మ్యూజియంలో పాతకాలం నాటి ఆభరణాలు, పెయింటింగులు, యుద్ధ సామాగ్రి, డెకరేషన్ సంబంధ వస్తువులు ఉంటాయి.
ఈ మ్యూజియంలో బౌద్ధమతానికి సంబంధించిన ప్రత్యేక విభాగం ఉంటుంది. అక్కడ అశోకుడు నిర్మించిన బౌద్ధ స్థూపాన్ని, బుద్ధ విగ్రహాలను చూడవచ్చు.
ఇండియన్ మ్యూజియం-కోల్ కత్తా :
భారతదేశంలోని పురాతన మ్యూజియం ఇది. 1814సంవత్సరంలో బెంగాల్ కు చెందిన ఆసియా సొసైటీ దీన్ని నిర్మించారు. మొఘలుల కాలం నాటి పెయింటింగ్స్, ఆభరణాలు, పురాతన అస్థి పంజరాలు ఇక్కడ కనిపిస్తాయి.
Details
వివిధ రకాల గడియారాలు ఉండే మ్యూజియం
సాలార్ జంగ్ మ్యూజియం - హైదరాబాద్
మూసి నది ఒడ్డున ఉన్న ఈ మ్యూజియంలో రకరకాల వస్తువులు కనిపిస్తాయి. వింత వింత గడియారాలు, యూరోపియ కళా వస్తువులు, పుస్తకాలు, శిల్పాలు, పెయింటింగ్స్, రాజుల కాలం నాటి వస్త్రాలు, కత్తులు మొదలైన వాటిని ఇక్కడ చూడవచ్చు.
గవర్నమెంట్ మ్యూజియం - చెన్నై
తమిళనాడులోని ఎగ్మోర్ ప్రాంతంలో ఉండే ఈ మ్యూజియంను 1851లో నిర్మించారు. దక్షిణ భారతదేశాన్ని ఏలిన చాళుక్యులు, చోళులు, విజయనగర సామ్రాజ్యాధి నేతలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి.
ఛత్రపతి శివాజీ వాస్తు మ్యూజియం - ముంబై:
20వ శతాబ్దం ఆరంభంలో ఈ మ్యూజియంను నిర్మించారు. గుప్తుల, చాళుక్యుల కాలం నాటి వస్తువులను చూడవచ్చు.