Talk Like A Pirate Day: చిత్ర విచిత్రమైన పనులు చేయడానికి ఒక రోజుందని మీకు తెలుసా?
ప్రపంచంలో ప్రతీ విషయం మీద దినోత్సవం జరుపుకోవడం చాలా సర్వసాధారణం. విమెన్స్ డే నుంచి మొదలుకొని మెన్స్ డే, మదర్స్ డే ఇలా రకరకాల దినోత్సవాలు జరుపుకుంటారు. అయితే మీకిది తెలుసా? ఇంటర్నేషనల్ టాక్ లైక్ ఎ పైరేట్ డే ని కూడా జరుపుకుంటారు. ఈ రోజున చిత్రవిచిత్రమైన విధంగా మాట్లాడటం, నవ్వు తెప్పించే విధంగా పనులు చేయడం వంటివి చేస్తుంటారు. మీలోని చిన్నపిల్లాడిని బయటకు తీసి హ్యాపీగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ రోజున అవతల వాళ్ళని ప్రాంక్ చేయడం, వాళ్ళ జోకులకు కౌంటర్స్ వేయడం, చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో కనిపించడం వంటివి చేస్తుంటారు. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ఈ రోజును జరుపుకుంటారు.
ఇంటర్నేషనల్ టాక్ లైక్ ఏ పైరేట్ డే చరిత్ర
1995సంవత్సరంలో జాన్ బౌరు అలియాస్ ఓల్ చంబకెట్, మార్క్ సమ్మర్స్ అలియాస్ క్యాప్ అండ్ స్లాపి అనే ఇద్దరు స్నేహితులు రాకెట్ బాల్ గేమ్ ఆడుతుండగా ఇలాంటి కొత్త ఆలోచనను తీసుకొచ్చారు. అప్పటినుండి ప్రతీ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ఈరోజును జరుపుతున్నారు. ఈ దినోత్సవంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనవచ్చు. వయసుతో సంబంధం లేకుండా వివిధ రకాల గెటప్పులు వేయడం, క్రియేటివిటీని వెలికి తీయడం, ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని రకరకాల ఆక్టివిటీస్ చేయడం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించడం చేస్తుంటారు. బయట ప్రపంచంలోని బాధలన్నీ మరచిపోయి హ్యాపీగా, ప్రశాంతంగా, చిత్ర విచిత్రంగా ఈ రోజును గడుపుతారు.