ఇంటర్నేషనల్ వాఫిల్ డే 2023: నోరూరించే వాఫిల్స్ వెరైటీలను ఈజీగా తయారు చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం మార్చ్ 25వ తేదీన అంతర్జాతీయ వాఫిల్ దినోత్సంవంగా జరుపుతారు. నిజానికి ఈ దినోత్సవాన్ని కేవలం స్వీడన్ లో మాత్రమే జరుపుకునేవారు. ఆ తర్వాత ప్రపంచమంతా ఇది పాకింది.
కేక్ లాంటి పదార్థమైన వాఫిల్ ని తయారు చేయడం చాలా తేలిక. ప్రస్తుతం ఇందులోని వెరైటీలు ఎలా చేయాలో చూద్దాం.
బంగాళదుంప వాఫిల్:
చల్లని నీటిలో బంగాళదుంపలను ముంది 8నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడబోసి, బంగాళదుంపలను నలగ్గొట్టాలి.
పచ్చిగుడ్డు, పాలు, వెన్న ను ఒక పాత్రలో వేసి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చక్కెర, ఉప్పు కలపాలి. ఆ తర్వాత బంగాళదుంపలను కలిపి మిశ్రమం లాగా చేసి, వాఫిల్ పాత్రల్లో నింపి వండితే సరిపోతుంది.
రెసిపీస్
నోరూరించే కమ్మనైన వాఫిల్ రెసిపీస్
శనగపిండి వాఫిల్:
శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, కారం, ఉలిగడ్డలు, అల్లం, జీలకర్ర, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కాలీ ఫ్లవర్, నీళ్ళు ఒక పాత్రలో వేసి వేయించండి.
ఈ పిండి మిశ్రమాన్ని నూనె రాసిన వాఫిల్ పాత్రలో పోసి, బంగారు రంగు వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచాలి. అంతే, కరకరలాడే వాఫిల్స్ తయారైనట్టే.
పాలకూర వాఫిల్:
పాలకూర, సముద్రపు ఉప్పు, ఒరెగానో, గుడ్లు, వెల్లుల్లి పొడి, పాలు కలిపి గ్రైండర్ రుబ్బి మృదువైన తడిపిండిని తయారు చేయాలి. దీన్ని వేరే పాత్రలోకి తీసుకుని బేకింగ్ పౌడర్, పిండిని కలపాలి. దీనికి ఛీజ్ ముక్కలు కలుపుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు వాఫిల్ పాత్ర మీద తడిపిండిని పోసి తయారు చేయడమే.