
అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
యువత ఎదుర్కుంటున్న సవాళ్ళు, సమాజానికి యువత అందిస్తున్న సహకారం మొదలగు అంశాలపై చర్చించడానికి యువజన దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తారు. యువతకు సందేశాలను అందించే మెంటార్స్ తో ఉపన్యాసాలు అందిస్తారు.
చరిత్ర:
1965లో మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో యువతకు వనరులను అందించాలని, వారు ఎదగడానికి తోడ్పడాలని, అలాగే భవిష్యత్తు నాయకులు యువకులను తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది.
ఆ తర్వాత 1999లో అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. మొదటిసారిగా 2000 సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది.
Details
అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023 థీమ్
ఈ ఏడాది గ్రీన్ స్కిల్ ఫర్ యూత్ అనే థీమ్ ని ఎంచుకున్నారు.
అంటే జీవితానికి అవసరమయ్యే జ్ఞానం, సామర్థ్యం, విలువలు, వ్యవహారాలను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ థీమ్ ని నిర్ణయించారు.
కొటేషన్లు:
నేటి యువతదే రేపటి భవిష్యత్తు.. అందుకే రేపటి బాగుకోసం యువత ఈరోజు కష్టపడాలి.
యువతలో మంచి అలవాట్లు ఉన్నప్పుడే మార్పు కచ్చితంగా వస్తుంది, అద్భుతంగా వస్తుంది - అరిస్టాటిల్.
నాయకుడి కోసం ఎదురుచూడకుండా నీకు నువ్వే నాయకుడిగా మారాలి. అప్పుడే మార్పు వస్తుంది - మదర్ థెరిసా.