Mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఏ వయసులో లాభాలు వస్తాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రస్తుతం పెట్టుబడిదారులలో విశేష ఆదరణ పొందుతున్నాయి.
తక్కువ రిస్క్‌తో పాటు దీర్ఘకాలికంగా మంచి రాబడులు అందించే పెట్టుబడిగా మ్యూచువల్ ఫండ్స్ అందరికీ అనువైనవని చెప్పొచ్చు.
అయితే దీర్ఘకాల పెట్టుబడుల వల్ల ఎంత లాభం పొందవచ్చో, ఏ వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే ఎంత వరకు సంపాదించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మార్గాలు
1. లంప్‌సమ్ పెట్టుబడి : ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి
2. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ : నెలవారీగా తక్కువ మొత్తంతో పెట్టుబడిని కొనసాగించవచ్చు.
ఈ రెండు పద్ధతులలో SIPను ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్థికంగా సులభమైనది.
Details
చక్రవడ్డీ రూపంలో రాబడులు
మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు చక్రవడ్డీ రూపంలో పెరుగుతాయి.
మీరు పెట్టుబడి పెట్టిన కాలానికి తోడు వడ్డీ అసలు మొత్తంలో కలిసిపోవడం వల్ల దీర్ఘకాలంలో పెరిగిన ఫలితాలను పొందవచ్చు.
20 ఏళ్ల వయస్సులో SIP ప్రారంభించి, నెలకు వెయ్యి పెట్టుబడి పెడితే 40 ఏళ్ల తర్వాత రూ.1.19 కోట్లు లభిస్తాయి.
ప్రతేడాది SIP మొత్తాన్ని 10శాతం పెంచుకుంటూ పోతే రూ. 3.5 కోట్లు పొందవచ్చు.
30 ఏళ్ల వయస్సులో SIP ప్రారంభించి, నెలకు రూ.3వేలు పెట్టుబడి చేస్తే, 30 ఏళ్ల తర్వాత రూ.1.05 కోట్లు వస్తాయి.
40 ఏళ్ల వయస్సులో SIP ప్రారంభించి నెలకు రూ.4వేలు పెట్టుబడి చేస్తే, 20 ఏళ్ల తర్వాత రూ.80 లక్షలు పొందవచ్చు.