Tour: ఒకే ట్రిప్‌లో అరకు, సింహాచలం.. ఐఆర్‌సీటీసీ తాజా టూర్ ప్యాకేజీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి అందాలతో కళకళలాడే అరకు లోయను సందర్శించాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది. అరకుతో పాటు సింహాచలం దేవాలయ దర్శనాన్ని కూడా కలిపి ఒకే పర్యటనలో పూర్తిచేసుకునేలా 'వైజాగ్ రీట్రీట్' పేరుతో కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ 2 రాత్రులు - 3 రోజుల వ్యవధిలో విశాఖపట్నం, అరకు, సింహాచలం వంటి ప్రముఖ టూరిజం పాయింట్లను కవర్ చేయనుంది. ప్రస్తుతం ఈ పర్యటన 2025 నవంబర్ 10 తేదీకి అందుబాటులో ఉంది. అయితే లక్ష్యిత తేదీ లో పాల్గోలేని వారు ఇతర తేదీలను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.
వివరాలు
ప్రయాణ వివరాలు
మొదటి రోజు: విశాఖపట్టణంలోని ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ లేదా బస్‌స్టాండ్ వద్ద ప్రయాణికులను తీసుకుని హోటల్‌లో ఏర్పాటు చేస్తారు. అల్పాహారం అనంతరం తొట్లకొండ బౌద్ధ అవశేషాలు, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ వంటి ప్రసిద్ధ స్థలాలను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస ఉంటుంది. రెండో రోజు: ఉదయం 8 గంటలకు అరకు బయలుదేరతారు. తైడా జంగిల్ బెల్స్, పద్మపురం ఉద్యానవనం, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు సందర్శించి తిరిగి విశాఖకు చేరుకుంటారు. రాత్రివేళ విశాఖపట్నంలోనే బస. మూడో రోజు: అల్పాహారం తర్వాత సింహాచలం దర్శనం ఉంటుంది. అనంతరం ప్రయాణికులను తిరిగి ఎయిర్‌పోర్ట్/రైల్వే స్టేషన్/బస్‌స్టాండ్ వద్ద విడిచిపెట్టి ప్యాకేజీ పూర్తవుతుంది.
వివరాలు
ప్యాకేజీ ధరలు
వసతి విధానం ధర (కంఫర్ట్ క్లాస్) ట్రిపుల్ ఆక్యుపెన్సీ ₹9,280 డబుల్ ఆక్యుపెన్సీ ₹12,105 సింగిల్ ఆక్యుపెన్సీ ₹22,530 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు ధరలు వేరుగా ఉన్నాయి. బుకింగ్ & సమాచారం ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు బుకింగ్ కోసం: https://www.irctctourism.com సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8287932318 9281495847 9550166168