Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే మంచిదే.. కానీ అలాంటి వ్యక్తులు తాగితే డేంజర్
కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో బోలెడెన్నీ పోషకాలు లభిస్తారు. శరీరానికి తక్షణమే శక్తినిచ్చే గుణం ఇందులో ఉండడం వల్ల చాలామంది కొబ్బరినీళ్లను తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లు శరీర ఉష్ణోగ్రతను అదుపులోకి ఉంచుతాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, సోడియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల లోపు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువును అదుపులోకి ఉంచుకోవాలని అనుకునే కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి
కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలున్న వారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి
సోడా లేదా షుగర్ డ్రింక్స్ తీసుకోవడానికి బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం శ్రేష్టమని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అయితే రక్తంతో అధిక మోతాదులో పోటాషియం నిల్వలు ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. బీపీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు.