NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి
    తదుపరి వార్తా కథనం
    చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి
    పరీక్షల ఒత్తిడిని దూరం చేసే ఆహారాలు

    చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 15, 2023
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే సమయం వచ్చేసింది. ఈ టైంలో కొంచెం టెన్షన్ గా ఉండడం సహజమే. ఒక్కోసారి ఆ టెన్షన్ కూడా మిమ్మల్ని బాగా చదివించేలా చేస్తుంది.

    కాకపోతే టెన్షన్ మరీ పెరిగిపోయినప్పుడు మీరు చదవలేరు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది.

    ఫలితంగా ఎగ్జామ్స్ మీద ప్రభావం ఉంటుంది. ఎగ్జామ్స్ టైం లో ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని ఆహారాలు పనిచేస్తాయి

    పండ్లు, కూరగాయలు :

    పండ్ల లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగ్గా చేస్తాయి. ఈ సీజన్లో దొరికే అన్ని పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. పిండి పదార్థాలు లేని బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకుకూరలు మీకు మేలు చేస్తాయి. బంగాళదుంపలను ఎగ్జామ్స్ టైం లో పక్కన పెట్టండి.

    ఒత్తిడి

    ఎగ్జామ్స్ టైమ్ లో ఒత్తిడిని తగ్గించే ఆహారాలు

    పెరుగు

    పరీక్షల సమయంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినాలని చాలామంది చెబుతారు. అదెందుకో తెలుసా? పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, కడుపుకు సంబంధించిన ఇబ్బందులను దూరం పెట్టి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

    డార్క్ చాక్లెట్

    ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కారణంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. చాక్లెట్ కారణంగా మెదడులో ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    గింజలు, విత్తనాలు

    మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ.. మొదలగు పోషకాలు గింజలు, విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. మంచి కొవ్వులైనా ఒమేగా3, ఒమేగా6 కొవ్వు ఆమ్లాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. బాదం, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, సూర్యపువ్వు విత్తనాలు తినాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025