Loading...
Janmashtami: జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను ఇలా కృష్ణుడిలా అందంగా రెడీ చేయండిలా
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను ఇలా కృష్ణుడిలా అందంగా రెడీ చేయండిలా

Janmashtami: జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను ఇలా కృష్ణుడిలా అందంగా రెడీ చేయండిలా

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకృష్ణుడి జన్మాష్టమిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా చిన్నారులను బాలకృష్ణుడిగా ముస్తాబు చేయడం, గోపికల వేషధారణ, ఉట్టి కొట్టించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తమ చిన్నారిని కృష్ణుడిలా రెడీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకోసం వారు రెండు మూడు రోజుల ముందుగానే అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకుంటారు. చిన్నారి కృష్ణుడి వేషంలో ఇల్లంతా తిరుగుతుంటే ఆ ఆనందమే వేరు. మరి మీ చిన్నారిని చాలా సులభంగా కృష్ణుడిలా ఎలా ముస్తాబు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

మార్కెట్‌లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిరీటాలు..

మీ చిన్నారిని కృష్ణుడిగా రెడీ చేయాలనుకుంటే ముందుగా వారికి వేసే దుస్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

అవి పిల్లలకు సౌకర్యంగా ఉండటంతో పాటు చూడటానికి అందంగా కనిపించేలా ఉండాలి.

మరీ వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోకపోవడం మంచిది. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి పసుపు రంగు దుస్తులు ఇష్టమనే నమ్మకం ఉంది.

అందుకే పసుపు రంగు దుస్తులను ఎంచుకోవచ్చు. లేదంటే ధోతి, కుర్తాతో కూడా చిన్నారిని అందంగా ముస్తాబు చేయవచ్చు.

కృష్ణుడి వేషధారణలో కిరీటం, నెమలి ఈకకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఈ రెండూ లేకపోతే కృష్ణుడి రూపం పూర్తికాదని చాలామంది భావిస్తారు. అందుకే మార్కెట్‌లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిరీటాలు, నెమలి ఈకలు అందుబాటులో ఉంటాయి.

వివరాలు

మరింత ఆకర్షణీయంగా వేణువు..

అయితే బయట కొనుగోలు చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే కిరీటాన్ని తయారు చేసుకోవచ్చు.

ఇందుకోసం కార్డ్‌బోర్డ్ పట్టీని తీసుకుని కిరీటం ఆకారంలో కట్ చేసి, దానిపై మెరుపులు, పూసలు వంటి వాటితో అలంకరించాలి.

చివర్లో చిన్న నెమలి ఈకను అతికిస్తే అందమైన కిరీటం సిద్ధమవుతుంది.

ఇది చిన్నారి కృష్ణుడి రూపానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది.

అలాగే శ్రీకృష్ణుడి చేతిలో వేణువు తప్పక ఉండేలా చూసుకోవాలి.

ఇందుకోసం సాధారణ చెక్క వేణువును తీసుకుని దానికి రంగురంగుల రిబ్బన్లు చుట్టవచ్చు. దీంతో వేణువు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

చిన్నారి కృష్ణుడి లుక్ మరింత అందంగా ఇలా..

ఇక వెన్న కుండలా కనిపించేందుకు మట్టి కుండను తీసుకుని అందంగా అలంకరించి, అందులో కొద్దిగా దూది వేయవచ్చు.

దీంతో చిన్నారి కృష్ణుడి లుక్ మరింత అందంగా కనిపిస్తుంది. ఫొటోలు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది.

కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు రంగురంగుల దుస్తులు వేయించి ప్రత్యేకంగా ముస్తాబు చేయాలనుకుంటారు.

అలాంటి వారు మార్కెట్‌లో లభించే 'హరే రామ్ హరే కృష్ణ' డిజైన్ ఉన్న కుర్తాలను కొనుగోలు చేసి పిల్లలను అందంగా రెడీ చేయవచ్చు.

అంతేకాకుండా చిన్నారిని ముస్తాబు చేసే సమయంలో చేతులు, కాళ్లకు గోరింటాకు వంటి డిజైన్లు వేస్తే వారి లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT