సాయంత్రం స్నాక్స్: నోటికి కారం తగిలి మనసుకు మజానిచ్చే కచోరీ వెరైటీలు ప్రయత్నించండి
సరాదా సాయంత్రాల్లో స్నాక్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. జనరల్ గా సాయంత్రాల్లో ఏదైనా కారంగా ఉండే ఆహారాలు తినాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఈ కచోరీ వెరైటీలు బాగుంటాయి. కరకరలాడే కచోరీలు నోటికి రుచిగా ఉంటాయి. వీటిల్లో వెరైటీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చబఠాణీతో కచోరీ: పెరుగు, గోధుమరవ్వ, ఉప్పు కలిపి పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కచోరీల్లో నింపడానికి పచ్చ బఠాణీలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని ఒకే దగ్గర కలిపాలి. దీనికి వాము, గరం మసాలా, ధనియాల పొడి, ఛాట్ మసాలా కలపాలి. పిండిముద్దతో గుండ్రంగా బాల్స్ తయారు చేసి అందులో బఠాణీలతో తయారు చేసుకున్న దాన్ని నింపాలి. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రై చేయండి
కచోరీల్లోని వెరైటీలను తయారు చేయండిలా
పెసరపప్పు కచోరీ: గోధుమ పిండి, ఉప్పు, నిమ్మరసం, వంటనూనె, మంచినీళ్ళను కలిపి పిండిముద్ద తయారు చేయాలి. కారం, ఉప్పు, ఇంగువ, నానబెట్టిన పెసరపప్పు, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్కను నూనెలో వేయించి పక్కన పెట్టుకోండి. నూనెలో వేయించిన దానికి కొత్తిమీర, కొబ్బరిపొడి, అల్లంపేస్ట్, చక్కెర కలుపుకోవాలి. తర్వాత పిండి ముద్దలతో బాల్స్ చేసుకుని వాటిల్లో పై మిశ్రమాన్ని కూర్చి డీప్ ఫ్రై చేయండి. మొక్కజొన్న కచోరీ: మొక్కజొన్న గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిరప, ఇంగువ, అల్లం, రుబ్బుకున్న మొక్కజొన్న పిండిని నూనెలో వేయించాలి. కారం,గరంమసాలా, గోధుమరవ్వ, ఉప్పు, మైదాపిండి కలిపి పిండిముద్ద తయారు చేసుకుని చిన్న బాల్స్ గా తయారు చేసుకుని నూనెలో వేయించిన దాన్ని వీటిల్లో కూర్చిపెట్టి డీప్ ఫ్రై చేయాలి.