LOADING...
Karthika Masam: జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు(అక్టోబర్ 24) ఇలాచేస్తే చాలు..
జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు(అక్టోబర్ 24) ఇలాచేస్తే చాలు..

Karthika Masam: జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు(అక్టోబర్ 24) ఇలాచేస్తే చాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీక మాసంలో మూడవ రోజు ఏ విధమైన ఆచారాలు,పూజలు చేపట్టితే సమస్త శుభాలు పొందవచ్చో తెలుసుకుందాం. అదేవిధంగా, ఈ రోజున తల్లిదండ్రులు పాటించే విధి విధానాల వల్ల పిల్లల పాపాలు తొలగి, వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు. త్రిలోచన గౌరీ వ్రతం కార్తీక మాసంలో మూడవ రోజు త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించడం చాలా మంచిదని ప్రామాణిక శాస్త్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ వ్రతం ఆచరించలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా గౌరీ పూజ చేయవచ్చు.

వివరాలు 

గౌరీ పూజ విధానం: 

ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచండి. పూజ గదిలో పైభాగంలో ఎడమ వైపు, కుడి వైపు కుంకుమ బొట్లు పెట్టి, వాటిని గౌరీ స్వరూపంగా భావించండి. అక్షింతలతో, పుష్పాలతో పూజ చేయండి. 21 సార్లు "ఓం హరిద్ర కుంకుమ ఆరాధ్యాయై నమో నమః" మంత్రాన్ని పఠించండి. బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహ సంబంధ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున ఎవరైనా శివాలయానికి లేదా విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్లాలి. రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేదా శివాలయాలు. వెళ్లేటప్పుడు ఎర్ర మందార పూలు,ఎర్ర గులాబీ పూలు తీసుకొని వెళ్ళండి. ఆలయంలో వాటిని శివుడికి లేదా విష్ణువుకు సమర్పించండి.

వివరాలు 

దేవాలయానికి వెళ్ళలేని వారు: 

ఇంట్లోనే ఎర్రమందార,ఎర్ర గులాబీ పూలతో శివకేశవులను పూజించవచ్చు.ఆలయంలో ఉంటే అర్చకులకు పూలను ఇచ్చి స్వామికి సమర్పించమని చెప్పండి. ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించి,ఆవునెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం చేయండి. ఈ విధంగా చేస్తే కార్తీక మాసంలో మూడో రోజు పూజ ఫలితాన్ని ఎవరికైనా ధారపోసే శక్తి కలుగుతుంది. తల్లిదండ్రులు అయితే పిల్లలకు ధారపోయండి. అక్టోబర్ 24 శుక్రవారం ఆలయానికి వెళ్ళి ఎర్రపూలు సమర్పించాలి.ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించి, ఆవునెయ్యి దానం చేయాలి. ఇంటికి వచ్చి,దోసిట్లో నీళ్లు తీసుకుని,తులసికోటలో ఆ నీళ్లు పోసుతూ ఇలా అనుకోండి:"ఈరోజు పూజా ఫలితాన్ని నా పిల్లలకు ధారపోస్తున్నాను." ఇలా చేస్తే,పిల్లలు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరతారు.కార్తీకమాసంలో మూడో రోజు ఈ విధి విధానాలను తల్లిదండ్రులు పాటించడం అత్యంత ముఖ్యం.