LOADING...
Karthika masam: కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా?
కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా

Karthika masam: కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీకమాసం ఎంతో పుణ్యమయమైనది. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే సూర్యాస్తమయం అనంతరం దీపారాధన చేసి శివకేశవులను ఆరాధిస్తే, వారి అనుగ్రహంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి, జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. కార్తీక మాసంలో దానం చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది. ప్రతి దానానికి ప్రత్యేకమైన పుణ్యం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేయగల దానాలు, వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి:

Details

నెయ్యి దానం చేస్తే రోగాలు తొలుగుతాయి

బియ్యం దానం: పాపాలు నశించి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వెండి దానం: మానసిక శాంతి,సుఖసంతోషాలు లభిస్తాయి. స్తోమత ఉన్నవారు వెండి దానం చేయడం శుభప్రదం. బంగారం దానం:దోషాలు తొలగిపోతాయి, జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతుంది. పెరుగు దానం:ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం లభిస్తాయి. పండ్ల దానం: కార్యసిద్ధి కలుగుతుంది. బ్రాహ్మణులకు లేదా పేదలకు పండ్లు ఇవ్వడం అత్యంత మేలు చేస్తుంది. నెయ్యి దానం: రోగాలు తొలగి, ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. పాలు దానం: నిద్రలేమి సమస్య తొలగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉసిరికాయలు దానం: జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మతిమరుపు దూరమవుతుంది. తేనె దానం: సంతానభాగ్యం లభిస్తుంది. సంతానం లేని వారు తేనెను దానం చేస్తే శుభఫలితాలు పొందుతారు. టెంకాయ (కొబ్బరికాయ)దానం: కార్యసిద్ధి, అడ్డంకుల నివారణ కలుగుతుంది.

Details

అన్నదానం చేస్తే పేదరికం పోతుంది

దీప దానం: కంటి చూపు మెరుగుపడుతుంది. గో దానం: రుణ విముక్తి కలుగుతుంది, ఋషుల ఆశీస్సులు పొందవచ్చు. వస్త్ర దానం: ఆయుష్షు పెరుగుతుంది. అన్నదానం: పేదరికం తొలగిపోతుంది, ధనవృద్ధి కలుగుతుంది. భూమి దానం: బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది, పరమ పుణ్యం లభిస్తుంది. ఇలా కార్తీక మాసంలో ప్రతి దానం ఒక్కో విధంగా మన జీవితానికి శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక వికాసం అందిస్తుంది. ఈ మాసంలో చేసే ప్రతి పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.