LOADING...
Kick Day 2025: ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం! 
ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం!

Kick Day 2025: ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

వాలెంటైన్ వీక్ ముగిసిన వెంటనే ప్రేమ విఫలమైన వారి కోసం యాంటీ వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15న స్లాప్ డే ముగియగా, ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. కిక్ డే అంటే నేరుగా ఎవరినైనా తన్నడం అనుకోవడం పొరపాటు. ఈ రోజున అసలు ఉద్దేశం హింస కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏమిటి? ప్రేమలో విఫలమైన వారు, మోసపోయిన వారు గతాన్ని విడిచి పెట్టి కొత్త జీవితం ప్రారంభించడానికి యాంటీ వాలెంటైన్ వీక్‌ను జరుపుకుంటారు. ఇందులో స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే లాంటి రోజులుంటాయి.

Details

 కిక్ డే ఉద్దేశం ఏమిటి? 

ఈ రోజు మిమ్మల్ని మోసం చేసిన వారిని తన్నడం కోసం కాదని, బాధలు, కోపం, ద్వేషం అన్నింటినీ మనసులో నుంచి తన్ని పారేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే అసలు ఉద్దేశమని గుర్తుంచుకోవాలి. వారు మిమ్మల్ని బాధపెట్టిన రోజే వారిని మరిచిపోవాల్సిన అవసరం ఉంది. కిక్ డే అనేది మానసికంగా స్వేచ్ఛ పొందే రోజు.

Details

 కిక్ డేను ఎలా జరుపుకోవాలి? 

గతాన్ని తలచి బాధపడటం మానేయండి. మిమ్మల్ని మోసం చేసిన వారి గురించిన ఆలోచనలను పూర్తిగా తొలగించండి. వారి ఇచ్చిన బహుమతులు, లేఖలు, గుర్తులు అన్నింటినీ తన్ని దూరం చేసేయండి. మీకు నష్టాన్ని మిగిల్చిన వాటిని వదిలేసి, కొత్త జీవితాన్ని ఆరంభించండి. కొత్త అలవాట్లను మొదలు పెట్టండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. కిక్ డే అనేది కేవలం తన్నడానికి కాదు, మనస్సులోని చెడు భావాలను తన్నిపారేసి సంతోషంగా ముందుకు సాగేందుకు మనల్ని మనం ప్రేరేపించుకునే రోజు!