Mobile Addiction in Children : స్మార్ట్‌ఫోన్ ఫోన్ వాడకం.. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
చాలా పెద్దలలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ బానిస సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఈ సమస్య పిల్లల్లో కూడా కనిపించడం ప్రారంభమైంది. చిన్న వయస్సులోనే ఫోన్లను ఎక్కువగా ఉపయోగించే పిల్లలు, దీని ద్వారా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల, మీ పిల్లలు కూడా ఇలాంటివి అనుభవిస్తే, జాగ్రత్త అవసరం. తాజా అధ్యయనాల ప్రకారం, చిన్న వయసులో ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్ర లోపం, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయని తేలింది.
వివరాలు
అధ్యయనంలో వెల్లడైన గమనార్హ విషయాలు
అమెరికాలోని ఒక పరిశోధనలో 12 సంవత్సరాలకు తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో మొబైల్ వాడకం, ఫోన్ వ్యసనం వల్ల నిద్ర సమస్యలు, బరువు పెరగడం, ఆందోళన, మానసిక దుఃఖం వంటి సమస్యలు కనిపించాయని గుర్తించారు. ఫోన్ల కారణంగా వారి దినచర్య గణనీయంగా ప్రభావితమవుతుందని, తద్వారా ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని అధ్యయనం సూచిస్తుంది. ఫోన్ వాడే పిల్లలు రాత్రిపూట ఎక్కువ స్క్రోల్ చేస్తారు, అందువల్ల తక్కువ నిద్ర పొందుతారు. స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. సోషల్ మీడియాలో ఉన్న ప్రతికూల (negative) కంటెంట్ పిల్లల మనస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్నారులు దానిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మానసిక సమస్యలు మరింత పెరుగుతాయని తేలింది.
వివరాలు
నష్టాలను నివారించడానికి మార్గాలు
అలాగే, 12 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు ఫోన్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పటికీ, సోషల్ మీడియా కంటెంట్ వారి మానసిక స్వభావం, అభిరుచులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు తెలిపారు. చిన్న వయసులో ఫోన్ ఇస్తే వారి నైపుణ్యాల అభివృద్ధి తగ్గుతుందని గుర్తించారు. భద్రత, ఆన్‌లైన్ చదువు వంటి కారణాల కోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారు. పరిశోధకులు మరియు నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన నియమాలు: ఫోన్ సమయాన్ని నియంత్రించండి - పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ తీసుకోవడం లేదా స్క్రీన్ సమయాన్ని సెట్ చేయడం.
వివరాలు
పిల్లల మానసిక ఆరోగ్యం
మొబైల్ యాప్ కంట్రోల్ - పేరెంట్స్ కంట్రోల్ ఉపయోగించి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడం. సోషల్ మీడియా ప్రైవసీ - పిల్లల ఐడీలను సోషల్ మీడియాలో పెట్టడం, రీచ్ కోసం వాడడం వల్ల నెగిటివ్ కామెంట్స్ ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. బయటి ఆటలకు ప్రోత్సాహం - ఫోన్ గేమ్స్ కన్నా, పిల్లలను బయట ఆటలలో పాల్గొనించేలా ప్రోత్సాహించాలి. పిల్లలతో కూర్చొని మాట్లాడడం - వారి మానసిక స్థితిని, స్టడీపై ఆసక్తిని మెరుగుపరుస్తుంది. ఈ మార్గాలను పాటించడం వల్ల, పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, వారిలో అకడమిక్ ఆసక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.