Kiwi for Diabetes: రక్తంలో చక్కెరను నాశనం చేసే కివి పండు.. కివి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.కొద్దిపాటి అజాగ్రత్త రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో,ఆహారంలో మార్పులు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పండ్ల గురించి మాట్లాడినట్లయితే,కివి మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ సి కివిలో పెద్ద మొత్తంలో లభిస్తుంది.ఇది ఇతర వ్యాధులకు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. కివి బయటి నుండి సపోటా లాగా కనిపిస్తుంది. కానీ ఈ పండు లోపల నుండి పచ్చగా, రుచిలో పుల్లగా ఉంటుంది. ఇది చాల ఖరీదైన పండు.వాతావరణం మారినప్పుడు దాని రేటు మారుతుంది. దీని వినియోగం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతే కాదు,డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులలో ప్లేట్‌లెట్లను వేగంగా పెంచడానికి కూడా ఇది పనిచేస్తుంది.
కివి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది
డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకోవాలి. దీంతో షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. మీరు కివి తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, తక్కువ కేలరీలు, తక్కువ పిండి పదార్థాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ సాధారణ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కివి చాలా ఖరీదైన పండు, కానీ మీరు దీన్ని వారానికి రెండు-మూడు సార్లు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండుతో సెరోటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిద్ర కూడా బాగా వస్తుంది.
రక్తహీనతలో కివి ప్రయోజనకరంగా ఉంటుంది
కివిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. లుటిన్, ఫైటోకెమికల్స్ ఇందులో ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఐరన్ పరిమాణం పెరుగుతుంది. రక్తహీనత రోగులకు ఇది మేలు చేస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ ఒక కివీని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పచు. ఈ పండు కళ్లకు చాలా మంచిది కూడా.
డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి
భారత్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ప్లేట్‌లెట్స్ పడిపోవడం ప్రారంభమవుతుంది. కివిలో అత్యధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్ నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. రోగికి దాని నుండి పొటాషియం కూడా లభిస్తుంది, ఇది ప్లేట్‌లెట్లను తయారు చేయడంలో సహాయపడుతుంది.