
Anosmia: వాసన పసిగట్ట లేకపోవడమనే వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ 19 సమయంలో చాలామంది వాసన పసిగట్టలేక ఇబ్బంది పడ్డారు. కోవిడ్ 19 సోకడం వల్ల వాసన పసిగట్ట లేకపోవడం, రుచి తెలియకపోవడం సంభవించింది.
అయితే మీకిది తెలుసా? వాసన పసిగట్టలేకపోవడమే వ్యాధి కోవిడ్ 19 ద్వారా మాత్రమే కాదు, ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. ఈ వ్యాధిని టెక్నికల్ గా అనోస్మియా అంటారు.
ప్రస్తుతం అనోస్మియా ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి, చికిత్స ఏంటో తెలుసుకుందాం.
అసలు వాసన ఎలా పసిగడతారు?
ఏదైనా వాసన బయటకు వచ్చినపుడు, గాలి ద్వారా ఆ వాసన అణువులు ముక్కులోని నరాన్ని తాకుతాయి. దాన్నే ఘ్రాణ నాడి అంటారు. ఈ ఘ్రాణ నాడి ద్వారా మెదడుకు సంకేతం చేరి అదేం వాసనో తెలియజేస్తుంది.
Details
ఈ వ్యాధితో బాధపడేవారికి వచ్చే సమస్యలు
వీళ్ళు ఆహారాన్ని వాసన ద్వారా గుర్తించలేరు కాబట్టి వీరికి ఆహారం పట్ల ఆకర్షణ ఉండదు. దానివల్ల తినాలన్న కోరిక తగ్గుతుంది.
విష పదార్థాల నుండి వచ్చే వాసన, గ్యాస్ లీక్స్, ధూమపానం, మొదలైన వాసనలు వీరికి తెలియవు కాబట్టి ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది.
శృంగార పరంగానూ వీరికి ఇబ్బంది ఉంటుంది. భాగస్వామితో సరైన ఆనందాన్ని పొందలేరు.
Details
అనోస్మియా కారణాలు, చికిత్స
కారణాలు:
వయసు పైబడుతున్న కొద్దీ కొందరిలో ఈ వ్యాధి వస్తుంది. మరికొందరిలో వారసత్వం వల్ల వస్తుంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు, విష రసాయనాలను పీల్చడం వంటి కారణాల వల్ల ఘ్రాణ నాడి మీద ప్రభావం పడి మెదడుకు సంకేతాలు చేరకపోవచ్చు.
పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, కోవిడ్ 19 వ్యాధుల వల్ల కూడా అనోస్మియా వస్తుంది.
చికిత్స:
ఏ కారణం వల్ల వచ్చిందన్న దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
జన్యు లోపాల వల్ల వస్తే సెల్ థెరపీ, జెనటిక్ థెరపీ చికిత్స చేస్తారు. ఇన్ఫెక్షన్ కారణంగా వస్తే దానికి సంబంధించిన మెడిసిన్లు వైద్యులు సూచిస్తారు.
తలకు గాయాలు తగలడం వల్ల ఈ వ్యాధి వస్తే స్మెల్ థెరపీ ట్రీట్మెంట్ తో నయం చేస్తారు.