ఆరోగ్యం: కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారాలు
శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ప్రధాన పాత్ర పొషిస్తుంది. అయితే ఈ పద్దతిలో కొన్నిసార్లు కాలేయం పాడవుతుంది. కాలేయంలో విషపదార్థాలు చేరి దాని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాలేయాన్ని శుభ్రపర్చాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. గ్రీన్ టీ: దీనిలో క్యాటికిన్స్ అధికంగా ఉంటాయి. ఈ కారణంగా కాలేయం పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇంకా గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను బయటకు తొలగిస్తాయి. పసుపు: గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగితే కాలేయం శుభ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. పొద్దున్న లేవగానే పసుపు కలిపిన పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
కాలేయంను ఆరోగ్యంగా ఉంచే ఎంజైమ్స్
పచ్చి కూరగాయలు, పండ్లు: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరోజులో 40శాతం పచ్చి కూరగాయలు లేదా పచ్చి పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి కూరగాయల్లో ఉండే ఎంజైమ్స్ కారణంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. క్యారెట్, బీట్ రూట్: క్యారెట్ లో ఉండే బీటా కెరాటిన్, విటమిన్-ఏ గా మారిపోయి కాలేయాన్ని సురక్షితంగా ఉంచుతుంది. విషపదార్థాలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బీట్ రూట్ సాయపడుతుంది. ఉసిరి: ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో ఉసిరి కీలక పాత్ర వహిస్తుంది. కాలేయం ఆరోగ్యం బాగుండాలంటే రోజూ పొద్దున్న లేవగానే ఉసిరి జ్యూస్ తాగితే మంచిదని నిపుణులుతెలియజేస్తున్నారు.