లక్ష్మణ ఫలం: క్యాన్సర్ ని నివారించే ఈ ఫలం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి
లక్ష్మణ ఫలం: బ్రెజిల్ కు చెందిన ఈ ఫలం భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మందంగా ఉండే తోలు, దానిపైన ముండ్లను కలిగి ఉండే ఈ పండు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్రీమ్ లాంటి గుజ్జు, అందులో నల్లటి గింజలు లక్ష్మణ ఫలంలో కనిపిస్తాయి. ఈ ఫలంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మూత్ర సంబంధ ఇబ్బందులను రాకుండా చూసుకుంటుంది: లక్ష్ణఫలంలో ఉండే సూక్ష్మజీవులను చంపే పోషకాల కారణంగా మూత్రాశయంలో ఏర్పడే బాక్టీరియా తయారు కాదు. మూత్రశయ ఇబ్బందులకు కారణమయ్యే ఈ కోలి బాక్టీరియాను లక్ష్మణ ఫలంలోని పోషకాలు చంపేస్తాయి.
లక్ష్మణ ఫలం వల్ల కలిగే లాభాలు
మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది: లక్ష్మణ ఫలంలో ఫైబర్ ఉంటుంది కావున జీర్ణశక్తి పెరుగుతుంది. పేగుల కదలికలను ఆరోగ్యంగా ఉంచడంలో ఫైబర్ సాయం చేస్తుంది. దీని కారణంగా మలబద్దకం దూరమవుతుంది. క్యాన్సర్ ని నివారిస్తుంది: క్యాన్సర్ ను నివారించే పోషకాలు లక్ష్మణఫలంలో ఉన్నాయని చెబుతారు. క్యాన్సర్ కణాలను లక్ష్మణ ఫలంలోని పోషకాలు చంపేస్తాయి. కొవ్వు పెరగకుండా చూసుకుంటుంది: ఇందులోని ఫైబర్ కారణంగా రక్త నాళాల్లో కొవ్వు నిల్వ కుండా కరిగిపోతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడం వల్ల గుండె సంబంధ ఇబ్బందులు తలెత్తవు. కండరాలు పట్టేయడాన్ని నివారిస్తుంది: కాలి కండరాలు పట్టేయడానికి ముఖ్య కారణం పొటాషియం లోపమే. లక్ష్మణ ఫలంలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.