Page Loader
world menstrual hygiene day: ప్రతి సంవత్సరం 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం' ఎందుకు జరుపుకుంటారు..ఈ రోజు చరిత్ర,ప్రాముఖ్యత.. ఏంటంటే..? 
world menstrual hygiene day: ప్రతి సంవత్సరం 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం' ఎందుకు జరుపుకుంటారు

world menstrual hygiene day: ప్రతి సంవత్సరం 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం' ఎందుకు జరుపుకుంటారు..ఈ రోజు చరిత్ర,ప్రాముఖ్యత.. ఏంటంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2024
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి సంవత్సరం మే 28వ తేదీని ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినం'(world menstrual hygiene day)గా జరుపుకుంటారు. పీరియడ్స్ సమయంలో మహిళలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు 'ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం' జరుపుకుంటారు. పీరియడ్స్ అనేది మహిళలకు 4-5 రోజుల సహజ ప్రక్రియ. ఇది ప్రతి స్త్రీ కి ఒక నిర్దిష్ట వయస్సులో రుతుక్రమం మొదలవుతుంది. ఈ కాలంలో, మహిళలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు ఇది చాలా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. పీరియడ్స్ సమయంలో అజాగ్రత్త గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 28న ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత, ఇతివృత్తం ఏమిటో తెలుసుకుందాం.

చరిత్ర 

ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర

'ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం' జరుపుకోవడం మొదట 2014 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది జర్మన్ లాభాపేక్షలేని సంస్థ WASH యునైటెడ్ ద్వారా ప్రారంభించబడింది. ఆ తర్వాత, ప్రతి సంవత్సరం మే 28న, ఈ సమస్యలన్నింటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రుతుక్రమం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పీరియడ్స్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో .. తెలుసుకోవడం కోసం ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం' జరుపుకుంటారు.

ప్రాముఖ్యత.థీమ్  

ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం ప్రాముఖ్యత

మే 28న 'ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం' జరుపుకోవడం వెనుక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి, చాలా మంది మహిళలు, బాలికలకు ప్రతి నెలా 5 రోజులు రుతుక్రమం వస్తుంది. పీరియడ్స్ చక్రం సగటు విరామం కూడా 28 రోజులు. అందుకే ప్రతి సంవత్సరం 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఋతు పరిశుభ్రత దినోత్సవం 2024 థీమ్ ఈ సంవత్సరం ఋతు పరిశుభ్రత దినోత్సవం 2024 థీమ్ వచ్చి #PeriodfriendlyWorld. 2023వ సంవత్సరంలో 'Making Menstruation a Normal Fact of Life by 2030' థీమ్ గా ఉంది .