Page Loader
Kondapur Archaeological Museum: 200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం
200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం

Kondapur Archaeological Museum: 200 ఏళ్ల పురాతన వస్తువులతో కొండాపూర్ పురావస్తు మ్యూజియం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2024
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొండాపూర్ పురావస్తు మ్యూజియం మన పురాతన జీవనశైలిని ప్రతిభింబిస్తోంది. గుమ్ములు, కుండలు, గిజాలు, వంట సామాగ్రి వంటి ప్రాచీన వస్తువులతో శతాబ్దాల నాటి జీవితం అర్థమయ్యేలా ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న మట్టికుండల్లో అన్నం, కూర వండే విధానాలు, ఆ కాలంలో ఉపయోగించిన ఇటుకలు, నాణేలు, తల్వార్లు వంటి వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ మ్యూజియం, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో 200 శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులను ప్రదర్శిస్తూ, భారత సంస్కృతికి గౌరవంగా నిలుస్తోంది.

Details

భారత చరిత్రకు ప్రతీకగా పురాతన వస్తువులు

1940-42 మధ్య జరిగిన తవ్వకాల్లో చిన్న చిన్న వస్తువులు, పెద్ద గుమ్ములు, గింజలు నిల్వ ఉంచే బాణలు, మట్టి పాత్రలు, బొమ్మలు, పూసలు, నాణేలు, ముద్రలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ మ్యూజియం సందర్శకుల సంఖ్య తగ్గిపోవడంతో శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సామాజిక విద్యకు సంబంధించిన అనేక అంశాలను ఈ మ్యూజియం ద్వారా అర్థం చేసుకోవచ్చు. కనుక దీనిపై మరింత దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. ఈ పురాతన వస్తువులు మన భారత చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మ్యూజియం మరింత అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.