Loading...
Krishna janmashtami: కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? నీరసం రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? నీరసం రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Krishna janmashtami: కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? నీరసం రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వ్రాసిన వారు Moogati Shabari
Sep 04, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం కోసం చాలామంది రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు నీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తే.. మరికొందరు పండ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. అయితే రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.

వివరాలు

ఉపవాసానికి ముందు తేలికపాటి ఆహారం ఇలా..

ఉపవాసం ప్రారంభించే ముందు రోజు రాత్రి లేదా ఉదయం తేలికగా, సులభంగా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవాలి.

ఎక్కువగా మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి కడుపు భారంగా అనిపించవచ్చు.

ఉపవాస సమయంలో అరటిపండ్లు, యాపిల్స్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు తీసుకోవడం మంచిది.

వీటిలో ఉండే సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి శక్తిని అందించడంతో పాటు నీరసం రాకుండా సహాయపడతాయి.

వివరాలు

సగ్గుబియ్యం, మఖానా, పెరుగు..

సగ్గుబియ్యంతో తయారు చేసిన కిచిడీ లేదా పాయసం ఉపవాస సమయంలో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

అయితే వీటిని తయారు చేసేటప్పుడు నూనె, నెయ్యి పరిమితంగా ఉపయోగించడం మంచిది.

అలాగే నెయ్యిలో దోరగా వేయించిన మఖానాలో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి.

ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభించడంతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.

ఫలహారం తీసుకుంటూ ఉపవాసం చేసేవారు రోజంతా సరిపడా నీరు తాగాలి.

నీటితో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

ఉపవాసం విరమించేటప్పుడు జాగ్రత్త..

ఉపవాసం పూర్తయిన వెంటనే ఒకేసారి భారీగా భోజనం చేయడం లేదా నూనెలో వేయించిన బరువైన పదార్థాలు తినడం మంచిది కాదు.

ముందుగా తేలికపాటి పండ్లు లేదా ద్రవ పదార్థాలు తీసుకుని ఉపవాసాన్ని విరమించాలి.

ఆ తర్వాత క్రమంగా సాధారణ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడకుండా ఉంటుంది.

కృష్ణాష్టమి ఉపవాస సమయంలో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

ADVERTISEMENT