Motivational: డబ్బు ఆదా చేయడం నేర్చుకో..కష్టసమయంలో అదే నిజమైన స్నేహితుడు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ధనానికి ఉన్న విలువను విపులంగా వివరించారు. ఆయన ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బు ఆదా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎందుకంటే కష్టకాలంలో స్నేహితులు, బంధువులు ఎప్పుడూ సహాయం చేయరని ఆయన చెబుతారు. అలాంటి సందర్భాల్లో మనకు తోడుగా నిలిచేది డబ్బే. అందువల్ల ఆలోచించకుండా, అవసరం లేకుండా ధనం ఖర్చు చేయకూడదని చాణక్యుడు స్పష్టం చేశారు. సమయానికి ఉన్న విలువ ప్రతి మనిషి జీవితంలో సమయం అమూల్యమైనది. చాణక్య నీతిలో చెప్పినట్లుగా, సమయాన్ని వృథా చేయడం అంటే అవకాశాలను కోల్పోవడమే. కొత్త సంవత్సరంలో విజయాన్ని అందుకోవాలంటే సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమయానికి పని చేసే వారు తప్పక విజయం సాధిస్తారని ఆయన బోధించారు
వివరాలు
లక్ష్య సాధనలో విమర్శల ప్రభావం
విమర్శలు వ్యక్తిని వెనక్కు లాగుతాయి. చాణక్యుడు చెప్పినట్లుగా, మనం విమర్శలలో మునిగిపోవద్దు. వీలైనంత వరకు ఇతరుల మాటల వల్ల మన ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఎవరికీ మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మనపై విమర్శలు చేస్తే, వాటిని ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా తీసుకుని మన లోపాలను సరిదిద్దుకోవాలి. మంచి ఆలోచనలతో, చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే మన లక్ష్యాలను చేరుకోగలం. కొత్త ఏడాదిలో ఎవరికీ నిరాశ కలగకుండా ఉండటమే కాదు, మన లోపాలను తొలగించుకోవడానికీ ఇది ఉత్తమ సమయం.
వివరాలు
దానం చేయడంలో వివేకం
చాణక్యుడు ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు.. నీటిపై నూనె వేసినట్లయితే, అవి కలిసిపోవు. నీరు, నూనె వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా మనిషి జీవితంలో చురుకుదనం, జ్ఞానం వేరు నిలవాలి. మన మేధస్సు ఎప్పుడూ కలుషిత వాతావరణంలోనూ కమలంలా వికసించాలి. కాబట్టి 2025లో విజయవంతమైన జీవితం కోరుకునే వారు తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. అర్హులైన వారికి విరాళాలు ఇస్తే, వారు వాటిని సరైన విధంగా వినియోగిస్తారు. ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.