మీ పర్సనాలిటీ టైప్ మీకు తెలుసా? ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ ప్రత్యేకతలు తెలుసుకోండి
మనుషులందరూ ఒకేలా ప్రవర్తించడం జరగని పని. ఒక్కో మనిషి బుర్ర ఒక్కోలా పనిచేస్తుంది. అంటే ఒక్కోమనిషిది ఒక్కో పర్సనాలిటీ అన్నమాట. ఆ పర్సనాలిటీ ప్రత్యేకతల్లో ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం. ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ అంటే: ఇలాంటి మనుషులు ఉత్సాహంగా, స్పాంటేనియస్ గా ఉంటారు. తమ తెలివితో అవతలి వారి హృదయాల్లోకి ఈజీగా వెళ్లగలరు. అలాగే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలరు. కాకపోతే వీరు తొందరగా బోర్ ఫీలవుతారు. ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ టైప్స్ ఏంటో చూద్దాం. వర్చుసో పర్సనాలిటీ: మీరు ఇంట్రావర్టా, ఎక్కువ ఆలోచిస్తారా? ఎక్కువ అబ్జర్వ్ చేస్తారా? ఐతే మీరు వర్చుసో పర్సనాలిటీ టైప్ అన్నమాట. ఈ రకం వారు చాలా మొండిగా ఉంటారు. స్పాంటేనియిటీ వీరిలో ఎక్కువగా ఉంటుంది.
ఎక్స్ ప్లోరర్ పర్సనాలిటీ టైప్స్
అడ్వెంచరర్ పర్సనాలిటీ: అవతలి వాళ్లతో ఎక్కువగా మాట్లాడరు, అందంగా ఉంటారు, ఆసక్తిగా కనిపిస్తారు. పోటీతత్వం ఎక్కువ, ప్రతీసారి కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త అనుభవాలను తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతుంటారు. ఎంట్రప్రెన్యూర్ పర్సనాలిటీ: వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ ఆలోచిస్తారు, అలాగే అబ్జర్వేషన్ పవర్ కూడా చాలా ఎక్కువ. చాలా చురుగ్గా ఉంటారు. ఏ పనిలోనైనా దూకేస్తారు. సమస్యలను పరిష్కరిస్తారు. కాకపోతే వీరికి ఓపిక చాలా తక్కువ. ఎంటర్ టైనర్ పర్సనాలిటీ: వీరు క్షణం కూడా అలసిపోరు. అవతలి వాళ్ళను ఆనందింపజేయడంలో ముందుంటారు. జనాలతో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరున్నప్పుడు ఎలాంటి గొడవలు జరగవు.