Page Loader
Motivation: జీవితం జోక్ కాదు..ఇవి రెండూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి!
జీవితం జోక్ కాదు..ఇవి రెండూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి!

Motivation: జీవితం జోక్ కాదు..ఇవి రెండూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడైన పండితులలో ఒకరు. ఆయన రచించిన 'చాణక్య నీతి' నేటికీ సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తోంది. జీవనవిధానం, సంబంధాలు, నైతికత, ఆర్థిక వ్యవహారాలు ఇలా అన్ని అంశాలపై చాణక్యుడు స్పష్టమైన దృక్పథాన్ని వెలిబుచ్చారు. ఆయన అనుభవాల ఆధారంగా చెప్పిన ప్రతి ఒక్క మాట ఇప్పటికీ విలువైన మార్గనిర్దేశంగా పనిచేస్తోంది. చాణక్యుడు చెప్పిన అంశాల్లో కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సరదాగా తీసుకోకూడదని హెచ్చరించారు. అందులో ముఖ్యంగా రెండు విషయాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు అవే శత్రువు, చెడు స్నేహం.

Details

శత్రువు విషయంలో జాగ్రత్త అవసరం

చాణక్యుని ప్రకారం, శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అతడిని నిర్లక్ష్యం చేస్తే, కాలక్రమేణా అతని శక్తి పెరిగి మనకే ప్రమాదం కలిగించే అవకాశముంటుంది. అగ్ని ప్రమాదం చిన్నదిగా కనిపించినా, అదుపులో పెట్టకపోతే అన్నిటినీ దహనముచేస్తుంది. శత్రువు కూడా అలానే అని చెప్పారు.

Details

చెడు స్నేహానికి దూరంగా ఉండాలి

మరొకటి, చెడు స్నేహం ఇది మన జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపగలదు. మంచి వ్యక్తి అయినా చెడు స్నేహితుల ప్రభావంతో తప్పుదోవ పట్టే అవకాశముంటుంది. కాలం ఉండగానే అలాంటి సంబంధాలను తెంచుకోకపోతే, జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రమాదం ఉంది. చాణక్యుని ఈ సూక్తులు మనం ప్రతిరోజూ ఎదుర్కొంటున్న పరిస్థితులపై బలమైన అర్థాన్ని ఇస్తున్నాయి. శత్రువు, చెడు స్నేహం లాంటి అంశాలను ఎప్పుడూ లైట్‌గా తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన బోధించారు.