LOADING...
Dussehra 2025: నవరాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంతోషం, ధనం పెరుగుతుంది
నవరాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంతోషం, ధనం పెరుగుతుంది

Dussehra 2025: నవరాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంతోషం, ధనం పెరుగుతుంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

హిందువులు నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రతి రోజు అమ్మవారి ఒక అవతారాన్ని ప్రతిష్టించి భక్తిగా పూజలు చేస్తే, సకల శుభాలు లభిస్తాయని నమ్మకం ఉంది. దసరా రాబోతోందని, చాలా మంది ఇప్పటికే 'నవరాత్రి పనులు' ప్రారంభించారు.

Details

 కర్పూర దీపం పూజ ప్రాముఖ్యత 

అమ్మవారి ఎదుట 'దీపారాధన' చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. కర్పూరం వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తులు వ్యాప్తి, ప్రతికూల శక్తులు తొలగిపోవడం జరుగుతాయి. సాధారణంగా దీపారాధన కోసం నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తారు. అయితే కర్పూరాన్ని వెలిగించడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఉన్న శక్తులు బ్యాలెన్స్ అవుతాయని, ప్రతికూల శక్తులు తొలగిపోవడంతో మనసు ప్రశాంతంగా మారుతుందని నమ్మకం ఉంది.

Details

కర్పూరం దీపాన్ని ఎలా వెలిగించాలి

దీపారాధనలో వత్తులో కర్పూరం పెట్టి వెలిగిస్తే ఇంట్లో 'సానుకూల వాతావరణం' ఏర్పడుతుంది. దీపారాధనలో కర్పూరం హారతిగా వాడడం ద్వారా దుర్గాదేవి సంతృప్తి, భక్తులపై ఆశీర్వాదం లభిస్తుంది. కర్పూరం, లవంగాలు కలిపి దీపంలో వేసి కాల్చడం ద్వారా: ఆర్థిక సమస్యలు తొలగుతాయి, డబ్బు కొరత ఉండదు. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, దుష్ట శక్తులు దూరమవుతాయి. సాయంత్రం పూట కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది శత్రువులపై పై చేయి సాధ్యం అవుతుంది, ఇంట్లో వివాదాలు తగ్గుతాయి. కర్పూర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సంతోషం, ధనం, ప్రశాంతత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.