ఆహారం: ఉప్మా రవ్వతో నోరూరించే రెసిపీస్ తయారు చేయండిలా
ఉప్మా అనగానే అబ్బా అని ముఖం చాటేస్తారు. చాలా సులభంగా తయారయ్యే వంటకం కాబట్టి అలా ఫీలవుతారు. కానీ మీకిది తెలుసా. దురుమ్ రకం గోధుమ నుండి తయారైన ఉప్మా రవ్వతో ఆరోగ్యానికి మంచి పోషకాలు లభిస్తాయి. దీనిలో విటమిన్ బి, ఫైబర్ ఉంటుంది. ఇవి శరీర బరువును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి. మరి ఈ రకం ఉప్మారవ్వతో ఎలాంటి వంటకాలు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. రవ్వా హల్వా: పండగలకు మనం ఇంట్లో చేసే కేసరి మాదిరిగానే దీన్ని తయారు చేయాలి. రవ్వను నెయ్యిలో వేయించి, దానికి యాలకులు, చక్కెర, పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టి హ్యాపీగా ఆరగించండి.
మరిన్ని ఉప్మా రవ్వ వెరైటీలు
ఉప్మా పాప్ కార్న్: ఒక పాత్రలో పాప్ కార్న్ గింజలను తీసుకోవాలి. వాటికి ఉప్పు, మిరపగింజలు, ఉప్మారవ్వను కలపండి. పాలు, ఒరెగానోను దీనికి కలిపి చిక్కటి ద్రావణంలా మార్చాలి. 15నిమిషాల తర్వాత ఆలివ్ ఆయిల్ పోసి ఉంచిన పాత్రలో ఫ్రై చేయాలి. పాత్రలోని ఆహారం బంగారు వర్ణంలోకి మారిన తర్వాత హ్యాపీగా తినండి. ఉప్మారవ్వ కేక్: ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, కొబ్బరి, ఉప్మారవ్వ, ఉప్పు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కెరను పొడిగా చేసి వెన్నలో కలుపుకుని ఒక పక్కన ఉంచాలి. దీనిలో గుడ్డు పచ్చసొన కలిపి, ఆ తర్వాత ఉప్మారవ్వ మిశ్రమాన్ని కలుపుకుని మంచి మిశ్రమంలా చేయాలి. దీన్ని వేరే పాత్రలోకి తీసుకుని కాసేపయ్యాక రిఫ్రిజిరేటర్ లోనిల్వ చేసుకోవాలి.