
హ్యాపీ వరల్డ్ స్మైల్ డే 2023: నవ్వుతూ జీవించాలి బ్రదరూ.. నేడే స్మెల్ డే
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుడి కోసం ఫ్రెండ్ షిప్ డే.. గురువు కోసం టీచర్స్ డే.. అమ్మ కోసం మదర్స్ డే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా రోజులే ఉన్నాయి. అయితే మనం నవ్వడానికి ఓ రోజు కూడా ఉంది.
అందుకే ప్రతేడాది అక్టోబర్ మొదటి శుక్రవారాన్ని నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు.
అన్ని దినోత్సవాలకు ఉన్నట్టుగానే ఈ దినోత్సవానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం గంటసేపైనా నవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ఏ ఒత్తిడి అయినా నవ్వుతోనే జయించవచ్చు.
అమెరికాలో మొదటిసారిగా 1963లో ఈ ప్రపంచ స్మైల్ డే వేడుకులను జరిపారు. హార్వే బాల్ అనే వ్యక్తి ఈ స్మైల్ సింబల్ ని ఆ రోజే ప్రపంచానికి అంకితం చేశారు
Details
అమెరికాలో ఘనంగా స్మైల్ డే దినోత్సవాలు
ప్రపంచ స్మైల్ డే దినోతవ్సాలు అమెరికాలో ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. ఈ వేడుకలను 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.ఈ రోజున స్మైల్ సింబల్ ని కనుగొన్న బాల్ హార్వే అవార్డును కూడా ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
వరల్డ్ స్మైల్ డే 2023: కోట్స్
"చిరునవ్వు అనేది ప్రతిదానిని నేరుగా సెట్ చేసే వక్రరేఖ." - ఫిల్లిస్ డిల్లర్
"స్మైల్, ఇది ఉచిత చికిత్స." - డగ్లస్ హోర్టన్
"చిరునవ్వు అనేది మీ ముక్కు కింద మీరు కనుగొనే ఆనందం." - టామ్ విల్సన్
"ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి. నా సుదీర్ఘ జీవితాన్ని నేను ఇలా వివరించాను." - జీన్ కాల్మెంట్