Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రాబోయే ఆరు వారాల్లో, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో పాల్గొనే భక్తులకు వసతి ఖర్చులు భారీగా ఉంటాయని స్పష్టం అవుతోంది.
కుంభమేళాలో వసతి ఖర్చులు
ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే యాత్రికుల కోసం ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా నదీ తీరాల్లో వసతి సదుపాయాలు అందుబాటులో ఉంచాయి.
అయితే,లగ్జరీ టెంట్ల అద్దె ఒక రాత్రికి రూ.70,000 నుండి రూ.1 లక్ష వరకు ఉండగా,నగరంలోని హోటళ్లలో రూమ్ అద్దె రూ.20,000 వరకు ఉంది.
వివరాలు
లగ్జరీ టెంట్ల ప్రత్యేకతలు
ఐఆర్సీటీసీ టెంట్ సిటీలో మాత్రం సగటు ధరల వద్ద వసతి లభిస్తోంది. ఇక్కడ ధరలు ఒక రాత్రికి రూ.1,500 నుండి ప్రారంభమవుతాయి.
లగ్జరీ క్యాంపింగ్ వ్యాపారంలో అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్ (టీయూటీసీ) ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 40 లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసింది.
ఇవి సూట్ బాత్రూం, వేడి నీటి సౌకర్యాలు, రెస్టారెంట్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయి.
టెంట్ల అద్దె ధరలు రూ.70,000 నుండి రూ.1 లక్ష వరకు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు, ఎన్‌ఆర్ఐలు వంటి ఖాతాదారుల కోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నారు.
వివరాలు
ఇతర వసతి ఎంపికలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) త్రివేణి సంగమానికి 3.5 కిలోమీటర్ల దూరంలో మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.
వీటి అద్దె రూ.18,000 నుండి రూ.20,000 వరకు ఉండగా,ఎయిర్ కండిషనింగ్, అటాచ్డ్ బాత్రూం, వై-ఫై, మూడు భోజనాలు లభిస్తాయి.
ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(UPSTDC)కూడా రాత్రికి రూ.1,500 నుండి రూ.35,000 వరకు టెంట్లను అందిస్తోంది.
ఆన్లైన్ ట్రావెల్ ప్యాకేజీలు
మేక్ మై ట్రిప్ వంటి ఆన్లైన్ వెబ్‌సైట్లు మూడు రాత్రులు, నాలుగు రోజుల కుంభమేళా ప్యాకేజీలను అందిస్తున్నాయి.
ఇవి ఒక్కొక్కరికి రూ.28,695 నుండి ప్రారంభమవుతాయి. ప్యాకేజీల్లో 4 స్టార్ హోటల్ బస, ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాప్, కుంభమేళా గైడెడ్ టూర్,త్రివేణి సంగమ దర్శనం వంటి సేవలు ఉంటాయి.
వివరాలు
హోటల్ అద్దెల వివరాలు
ప్రయాగ్‌రాజ్‌లో హోటల్ కన్హా శ్యామ్ అద్దె రూ.17,000, హోటల్ అజయ్ ఇంటర్నేషనల్ అద్దె రూ.21,000 నుండి ఉంటుంది.
త్రివేణి సంగమ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో గదుల అద్దె రూ.16,200గా ఉంది. లెజెండ్ హోటల్ ప్రీమియర్ గదులను జనవరి 17 నుండి 20 వరకు పన్నులతో కలిపి రూ.22,163కు అందిస్తోంది.
మరిన్ని సౌకర్యాలు
టెంట్ సిటీలో సాత్విక్ ఆహారం, ప్రత్యేక గైడ్ సేవలు, పడవ సదుపాయాలు, డాక్టర్-ఆన్-కాల్ సేవలు, మరియు మహిళా గైడ్లను అందిస్తున్నారు. సమీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో అనుసంధానం కూడా ఉంది.