Page Loader
మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు

మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 17, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండగను జరుపుకుంటున్నారు. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి ఆ దేవడేవుడికి ప్రార్థనలు చేస్తారు. కొందరూ పూర్తిగా ఆహారం తినకుండా ఉపవాసం ఉంటే మరికొందరు కేవలం రాత్రిపూట పండ్లు మాత్రమే తింటారు. ఐతే పండ్ల మాదిరిగానే కొన్ని ఆహారాలను ఉపవాసం రోజు తినవచ్చు. అవేంటో వాటినెలా తయారు చేస్తారో చూద్దాం. సగ్గుబియ్యం వడలు: సగ్గుబియ్యాన్ని కొన్నిచోట్ల సాబుదానా అంటారు. సాబుదానాతో వడలు తయారు చేయాలంటే ముందుగా, సగ్గుబియ్యం, వేరుశనగ, కారం, పచ్చిమిర్చి, ఉప్పుమ్ కొత్తిమీర, నిమ్మరసం, ఉడికిన బంగాళదుంపలను ఒకే పాత్రలో వేసి మిక్సీతో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో బాగా వేయించాలి. ఆ తర్వాత వడ్డించడమే.

మహాశివరాత్రి

మహాశివరాత్రి రోజు తినగలిగే ఆహారాల రెసిపీస్

బంగాళదుంప పెరుగు: జీలకర్ర, నల్ల మిరియాలను నెయ్యిపోసిన పాత్రలో వేయించాలి. దీణిలో ఉడికిన బంగాళదుంపలను, ఉప్పును వేయాలి. ఇప్పుడు మరో నెయ్యి పూసిన పాత్రలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించి, బుల్గుర్ గోధుమ, పెరుగు, నీళ్ళు కలిపి బాగా కలపాలి. ఇందులో ఫ్రై చేసిన బంగాళదుంపలను, పచ్చిమిర్చిని కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సగ్గుబియ్యం కిచిడీ: సగ్గుబియ్యాన్ని ముందుగా కడిగి, 6గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత వేరుశనగ పల్లీలను వేయించి గ్రైండర్ లో వేసి పొడిమాదిరిగా చేసి సగ్గుబియ్యంలో కలుపుకోవాలి. పాత్రలో నెయ్యి వేసి, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన బంగాళదుంపలను వేయించి, సగ్గుబియ్యాన్ని ఈ పాత్రలో వేయాలి. నెమ్మదిగా కలుపుతూ ఉంటే సగ్గుబియ్యం కిచిడీ రెడీ.