జాతీయ బాదంపప్పు దినోత్సవం: బాదంతో ఈజీగా తయారయ్యే రెసిపీస్ తెలుసుకోండి
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన జాతీయ బాదంపప్పు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన బాదంపప్పులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, మంచి కొవ్వులు బాదంపప్పులో ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇంకా కడుపును నిండుగా ఉంచి తొందరగా ఆకలి కాకుండా చూసుకుంటుంది. ప్రస్తుతం బాదంపప్పుతో తయారయ్యే కొన్ని రెసిపీస్ గురించి తెలుసుకుందాం బాదం బ్రోకోలి సూప్ బ్రోకోలిని ముక్కలుగా కత్తిరించి ఆరు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బాదం, ఉప్పు, మిరియాలు, ఏవైనా కూరగాయలు, మీగడలేని పాలను బ్రోకోలితో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెనం మీద వేడిచేసి బాదం పొడి చల్లుకొని తినాలి.
బాదం తయారయ్యే రెసిపీస్
బాదం బార్ ఒక పాత్రలో నీళ్లు పోసి బెల్లము, తేనె వేసి బాగా మరిగించాలి. తర్వాత కొబ్బరి పొడి, నువ్వులు, ఓట్స్, బాదంపప్పులను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లము, తేనె మిశ్రమంలో.. వేయించి పక్కన పెట్టుకున్న వాటిని కలపాలి. 20నిమిషాలు బేక్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి వడ్డించండి. బాదం మిల్క్ షేక్ ఒక పాత్రలో పాలు పోసి కొద్దిగా చక్కెర, కొంత యాలకుల పొడి వేసి 15నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బాదంపప్పులను, పాలను గ్రైండర్లో వేసి పేస్టులాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న పాలలో కలిపి కొద్దిగా వేడి చేయాలి. కుంకుమపువ్వుతో అలంకరించి అందరికీ ఇవ్వండి.