మహవీర్ జయంతి 2023: జైనుల పండగ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జైన మతస్తులు జరుపుకునే పండగ మహవీర్ జయంతి, ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన వచ్చింది. 3వ తేదీ ఉదయం 6:24గంటలకు మొదలై 4వ తేదీ 8:05గంటల వరకు ఉంటుంది. జైన గురువు వర్ధమాన్ మహావీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. క్రీస్తు పూర్వం 599సంవత్సరంలో చైత్ర మాసంలో 13వ రోజున జన్మించారు వర్ధమాన్ మహవీర్. బీహార్ లోని కుందగ్రామ్ అనే ప్రాంతంలో మహవీర్ జన్మించినట్లు చెబుతారు. రాజవంశానికి చెందిన రాజు సిద్ధార్థ, రాణి త్రిశాల దంపతులకు జన్మించారు వర్ధమాన్ మహవీర్. సిరిసంపదలున్న ఇంట్లో పుట్టిన మహవీర్ కు డబ్బు పట్ల, భోగాల పట్ల ఆశ ఉండేది కాదు. తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉండేవారు మహవీర్.
ఉపవాసాలు చేయడం, దాన ధర్మాల్లో పాల్గొనే జైనులు
30ఏళ్ళ వయసులో అడవుల్లోకి వెళ్ళిపోయారు మహవీర్. జీవితంలో మోక్షం కోసం 12సంవత్సరాలు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. తన జీవితకాలంలో జైనులకు అనేక విలువైన విషయాలు బోధించారు మహవీర్. ఆయన జీవిత పాఠాల్లో అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహ( బంధాలు లేకపోవడం), ఆస్తేయ(దొంగతనం చేయకపోవడం), సత్య( నిజం మాత్రమే చెప్పడం) ముఖ్యమైనవి. మహవీర్ జయంతి రోజున, పై విషయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు జైనులు. మహవీర్ జయంతి పండగను జైనులు చాలా సింపుల్ గా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి వర్ధమాన్ మహవీర్ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండేందుకు జైనులు ఇష్టపడతారు. పేదలకు ఆహారం, బట్టలు దానం చేస్తుంటారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి