ప్రేరణ: మీకోసం ఒకరు సమయం ఇస్తున్నారంటే వాళ్ళ జీవితంలోని కొంత భాగాన్ని మీకిస్తున్నట్టే
ఈ వార్తాకథనం ఏంటి
టైమ్... ప్రస్తుత కాలంలో చాలామంది దగ్గర లేనిదిదే. అవును, రోజును 24గంటలు అయినా కూడా ఎవ్వరి దగ్గర కూడా టైమ్ లేదు.
కనీసం ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డానికే టైమ్ ఉండటం లేదు. ఇలాంటి కాలంలో ఒకరు మీకు టైమ్ ఇస్తున్నారంటే వాళ్ళకు మీరు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఎందుకంటే అవతలి వాళ్ళు మీకోసం సమయం ఇస్తున్నాడంటే దానర్థం కేవలం సమయం ఇస్తున్నాడనే కాదు, తమ జీవితంలోని కొంత భాగాన్ని ఇస్తున్నట్టే లెక్క.
అందుకే అవతలి వారికి టైమ్ చెప్పి, మీరు టైమ్ కి వెళ్ళకుండా ఉండకండి. తమ జీవితాల్లోంచి మీకోసం కొంత ఇచ్చేవారిని గౌరవించండి.
సాధారణంగా టైమ్ విలువ తెలిసిన వాళ్ళు అవతలి వారి టైమ్ ని వేస్ట్ చేయరు.
ప్రేరణ
సాయం చేసిన వాడిని చులకనగా చూసే సమాజం
ఇక్కడ టైమ్ ఇవ్వడమంటే మీకోసం నిలబడటం, మీ బాధలు వినడం, మీ పక్కన ఉండటం.
పైన చెప్పిన ప్రతీ దానికి టైమ్ కావాలని గుర్తుంచుకోండి.
మీకు టైమ్ ఇచ్చిన వారికి మీరు కూడా టైమ్ ఇవ్వండి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఒకటి ఉంది. తమకు టైమ్ ఇచ్చిన వారికి ఏదో కష్టం వచ్చి మీ టైమ్ వారికి కావాల్సి వస్తుంది.
అలాంటి టైమ్ లో వారికి సాయం చేయకుండా స్వార్థం చూసుకుంటారు. స్వార్థం చూసుకున్నా తప్పలేదు కానీ, తనకు సాయం చేసినపుడు అతడు ఖాళీగా ఉన్నాడని, అందుకే వచ్చాడని, నిజంగా పనుంటే సాయం చేయడానికి వచ్చేవాడా అని చులకనగా చూస్తారు.
ఇలాంటి వాళ్ళకు సాయం చేయకపోవడమే మంచిది.