Loading...
Itch-scratching business: నెలకు రూ.14 లక్షల ఆదాయం.. గంటకు రూ.4,200.. ఇదేం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
నెలకు రూ.14 లక్షల ఆదాయం..గంటకు రూ.4,200.. ఇదేం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు

Itch-scratching business: నెలకు రూ.14 లక్షల ఆదాయం.. గంటకు రూ.4,200.. ఇదేం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

'దురద ఒకడికి అయితే.. గోకుడు ఇంకొకడికా?' అనే వ్యంగ్య సామెత మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే చిన్నతనంలో వీపుపై దురద పుడితే అమ్మమ్మో, తాతయ్యో దగ్గరుండి మృదువుగా గోకినప్పుడు కలిగే ఆ హాయిని మాత్రం చాలామంది మర్చిపోలేరు. ఇప్పుడు అదే అనుభూతిని సేవగా మార్చి ఓ వ్యాపారవేత్త ఏకంగా గంటకు రూ.4,200 వసూలు చేస్తున్నాడు. థాయ్‌ మసాజ్‌, ఆయిల్‌ మసాజ్‌ వంటి సేవల గురించి మనకు తెలుసు. కానీ 'ఇచ్‌-స్క్రాచింగ్‌' పేరుతో శరీరాన్ని సున్నితంగా గోకే సేవ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఓ వ్యాపారంగా మారింది.

వివరాలు 

చిన్ననాటి అనుభూతి నుంచి వ్యాపార ఆలోచన

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల ఝాంగ్‌ షియావోకియావో ఈ ప్రత్యేకమైన వ్యాపారాన్ని ప్రారంభించాడు.

శరీరంపై దురద ఉన్న ప్రాంతాలను సున్నితంగా గోకే సేవను అందిస్తూ, దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు.

'సుమా' (Suma) అనే బ్రాండ్‌ పేరుతో షెన్‌జెన్‌లోని బావోవాన్‌, ఫుటియాన్‌ జిల్లాల్లో ప్రస్తుతం రెండు స్టోర్లను నిర్వహిస్తున్నాడు.

ఈ రెండు ఔట్‌లెట్ల ద్వారా నెలకు సుమారు రూ.14 లక్షలు అంటే దాదాపు 1,00,000 యువాన్ల ఆదాయం వస్తున్నట్లు ఝాంగ్‌ చెబుతున్నాడు.

ప్రస్తుతం రెండు కేంద్రాలతో కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని భవిష్యత్తులో చైనా వ్యాప్తంగా 100 ఔట్‌లెట్లకు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నాడు.

వివరాలు 

గంటకు రూ.4,200.. అసలు ఏం చేస్తారంటే?

ఈ సేవ కోసం కస్టమర్లు గంటకు సుమారు 300 యువాన్లు చెల్లిస్తారు.

భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.4,200కు సమానం. కస్టమర్లు రిలాక్స్‌ అవుతూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం, మెరుగైన నిద్ర పొందడం ఈ సేవ ప్రధాన ఉద్దేశమని ఝాంగ్‌ చెబుతున్నాడు.

తన వద్దకు వచ్చే కస్టమర్లలో దాదాపు 70 శాతం మంది పురుషులేనని అతడు వెల్లడించాడు. మిగిలిన 30 శాతం మంది మహిళలు ఉంటారని తెలిపాడు.

మసాజ్‌తో పోలిస్తే ఈ సేవ మరింత రిలాక్సింగ్‌గా అనిపిస్తుందని కొందరు కస్టమర్లు చెబుతున్నారని ఝాంగ్‌ పేర్కొన్నాడు.

ఈ కారణంగానే తనకు తిరిగి వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోందని చెప్పాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఎలా ఉంటుందీ 'ఇచ్‌-స్క్రాచింగ్‌' సర్వీస్‌?

ఈ సేవ కోసం వచ్చే కస్టమర్లు సాధారణ మసాజ్‌ సెంటర్లలో మాదిరిగానే బెడ్‌పై పడుకుంటారు.

అక్కడి సిబ్బంది ప్రత్యేకంగా రూపొందించిన పదునైన గోళ్లను ఉపయోగించి శరీరంలోని వివిధ భాగాలను సున్నితంగా గోకుతారు.

ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శరీరం రిలాక్స్‌ అయి ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుందని ఈ వ్యాపార నిర్వాహకుడు చెబుతున్నాడు.

ఈ వినూత్న వ్యాపార ఆలోచన వెనుక కూడా ఓ ఆసక్తికరమైన చిన్ననాటి జ్ఞాపకం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎలా ఉంటుందీ 'ఇచ్‌-స్క్రాచింగ్‌' సర్వీస్‌?

సోషల్‌ మీడియాలో ఓ మహిళ తన భర్త వీపును గోకుతున్న వీడియోను ఝాంగ్‌ చూశాడు.

ఆ దృశ్యం అతడికి తన చిన్నతనంలో తండ్రి తన వీపును గోకిన అనుభూతిని గుర్తుచేసింది.

ఆ హాయినిచ్చే అనుభూతిని ఇతరులకు సేవగా అందించవచ్చనే ఆలోచన అక్కడి నుంచే వచ్చింది.

అదే ఆలోచనను వ్యాపారంగా మలిచి 'సుమా' స్టోర్లను ప్రారంభించాడు.

ADVERTISEMENT