Mangoes: వేసవిలో రుచిని పంచే మామిడిపండ్లు.. దేశంలో టాప్ ఫేమస్ వేరైటీస్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలం వచ్చిందంటే చాలామందికి గుర్తుకొచ్చేది మామిడి పండ్లే. ఈ సీజన్ కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. మామిడి పండ్లంటే అంత ప్రేమ. భారతదేశంలో అనేక రకాల మామిడి పండ్లు పండుతాయి. ప్రతి రకానికి ప్రత్యేకమైన రుచి, ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అత్యంత రుచికరమైన, ప్రసిద్ధి చెందిన కొన్ని మామిడి పండ్ల రకాల గురించి తెలుసుకుందాం.
వివరాలు
బంగినపల్లి మామిడి పండ్లు
మామిడి పండ్లలో అత్యంత రుచికరమైన రకాలలో బంగినపల్లి ముందుంటుంది. దీని తీపి రుచి ఎంతో ప్రత్యేకం. చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి ఎంతో ఇష్టం. పెద్ద పరిమాణంలో ఉండే ఈ పండ్లు పసుపు రంగులో మెరిసిపోతూ తియ్యటి రుచిని అందిస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవి విస్తృతంగా పండిస్తారు. ఆల్ఫోన్సో మామిడి పండ్లు మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఎక్కువగా పండే ఆల్ఫోన్సో మామిడి పండ్లు తమ సువాసన, రుచితో ప్రత్యేక గుర్తింపు పొందాయి. చిన్నగా కనిపించినప్పటికీ లోపల ఎంతో జ్యూసీగా, తియ్యగా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి.
వివరాలు
కీసర్ మామిడి పండ్లు
గుజరాత్‌లోని గిర్ ప్రాంతంలో ఎక్కువగా పండే కీసర్ మామిడి పండ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి పసుపు రంగుతో పాటు కొంచెం నారింజ రంగులో కనిపిస్తాయి. వీటి తీపి రుచి కారణంగా స్వీట్లు తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తృతంగా పండే తోతాపురి మామిడి పండ్లు తీపి, పులుపు కలిసిన ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడమే కాకుండా, ఊరగాయలు, పచ్చడులు తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
వివరాలు
చౌసా మామిడి పండ్లు
మామిడి పండ్లలో 'రాజు'గా పరిగణించే చౌసా రకం మంచి రుచి, సువాసనతో ప్రసిద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి. ఇవి చాలా జ్యూసీగా, తియ్యగా ఉండటం వల్ల చాలామంది ఇష్టపడే రకాలలో ఒకటిగా నిలిచాయి. మొత్తానికి ప్రతి మామిడి రకానికి ప్రత్యేకమైన రుచి, గుణాలు ఉన్నాయి. వేసవిలో ఈ రకాల మామిడి పండ్లను ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన ఆనందాన్ని పొందవచ్చు.