అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా?
ప్రతీ సంవత్సరం మార్చ్ 23వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి మార్చ్ 23వ తేదీన ఎందుకు జరుపుతారు? భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ లకు మార్చ్ 23వ తేదీన లాహోర్ జైలులో బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఆరోజు వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. అయితే ఒక సంవత్సరంలో రెండుసార్లు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 30వ తేదీన కూడా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకునేందుకు జనవరి 30న అమరవీరుల దినోత్సవం
భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి మహాత్మగాంధీ చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు, ఆయన మరణించిన రోజు జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలా ఒకే దినోత్సవాన్ని రెండు వేరు వేరు రోజుల్లో జరుపుకోవడం, ఒక్క అమరవీరుల దినోత్సవంలోనే కనిపిస్తుంది. ఈ రోజున అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. అమరవీరుల దినోత్సవం కొటేషన్లు: ఈ రోజు మనం స్వేఛ్ఛగా ఊపిరి తీసుకుంటున్నామంటే, చాలామంది తమ ఊపిరిని ధారపోసారని గుర్తుంచుకోండి. వాళ్ల వల్లే ఈరోజు మనమిలా ఉన్నామని తెలుసుకోండి. కొటేషన్లు: వాళ్ళు నన్ను చంపొచ్చు, కానీ నా ఆలోచనలు చంపలేరు. వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టొచ్చు, కానీ దేశం కోసం నాలో రగులుతున్న ఆవేశాన్ని అణచలేరు- భగత్ సింగ్.