Year Ender 2025: 2025లో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయినా అమ్మాయిలు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే, వీరి వీడియోలు,ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు,2025లో సోషల్ మీడియా ద్వారా అప్రతిహత పాపులారిటీ పొందిన ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం. ఆర్యప్రియ భూయాన్ ఐపీఎల్-2025లో 'మిస్టరీ గర్ల్'గా గుర్తింపు పొందిన ఆర్యప్రియ భూయాన్ గౌహతికి చెందిన 19ఏళ్ల విద్యార్థిని. చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ధోనీ అవుట్ అయిన తర్వాత ఆమె చూపిన రియాక్షన్‌ను కెమెరా మ్యాన్ కేరాఫుల్‌గా క్యాచ్ చేసి స్క్రీన్‌పై చూపించగా,ఆ వీడియో రాత్రికే వైరల్ అయింది. ఈ వీడియో మీమ్‌లుగా మారి, ఆర్యప్రియకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
వివరాలు
మోనాలిసా
మహా కుంభమేళాలో పూసలు అమ్మడానికి వెళ్లిన మోనాలిసా తన అందం, అమాయకత్వం వల్ల నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ప్రక్రియలో ఆమె సోషల్ మీడియాలో సంచలనంగా మారి, రాత్రికే స్టార్ అయ్యింది. ఇప్పుడు మోనాలిసా సినిమాల ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మహికా శర్మ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలసి కనిపించటం ద్వారా మహికా శర్మ వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె,మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షిస్తోంది. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియాని వంటి ప్రముఖ డిజైనర్ల షోల్లో ర్యాంప్ వాక్ చేసింది. హార్దిక్ పాండ్యాతో ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయ్యాయి. ఆమె వయస్సు 24 సంవత్సరాలు.
వివరాలు
గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం అయిన గౌరీ స్ప్రాట్ కూడా సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది. తండ్రి తమిళ-బ్రిటిష్, తల్లి పంజాబీ-ఐరిష్ అయినప్పటికీ, గౌరీ తాను భారతీయురాలిగా పరిచయం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తూ ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో పని చేస్తుంది. ఆమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేయడం ద్వారా ఆమెను సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చాడు.
వివరాలు
అలీషా ఓహ్రీ
అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, అలీషా ఓహ్రీ అనేక టైటిళ్లను గెలిచింది. బల్గేరియాలో జరిగిన మిసెస్ యూనివర్స్ పోటీలో ఆమె 'మిసెస్ పాపులర్' టైటిల్ గెలుచుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిసెస్ ఇండియా టైటిల్‌తో పాటు, అనేక అంతర్జాతీయ పోటీలలో కూడా విజయాలు సాధించింది. వృత్తిరీత్యా అలీషా మేకప్ ఆర్టిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్‌లో నైపుణ్యంతో ఉన్న వ్యక్తి.