నాలుగు సంవత్సరాల పాప ఎత్తుకు సమానంగా ఉన్న పిల్లి గురించి మీకు తెలుసా?
రష్యాకు చెందిన యులియా మినినా, కెఫిర్ అనే పిల్లిని పెంచుకుంటుంది. ఆ పిల్లి పొడవు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. 4సంవత్సరాల పాప ఎంత ఎత్తుగా ఉంటుందో ఆ పిల్లి కూడా అంత ఎత్తుగా ఉంటుంది. మైనీ కూన్ జాతికి చెందిన ఈ పిల్లి, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పిల్లి అని చెప్పుకుంటున్నారు. దీని ఎత్తు కారణంగా సోషల్ మీడియాలో కెఫిర్ బాగా ఫేమస్ అయ్యింది. కెఫిర్ వీడియోలను తరచుగా మినినా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఖాతాను కూడా తెరిచింది. కెఫిర్ ఇన్స్ టా ఖాతాకు 74వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2020 నుండి కెఫిర్ ని మినినా పెంచుకుంటుంది.
తలుపులు ఓపెన్ చేయడం కెఫిర్ కు బాగా తెలుసు
కెఫిర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తలుపులను కూడా కెఫిర్ ఓపెన్ చేస్తుంది. తలుపులను ఓపెన్ చేసే కెఫిర్ వీడియోకు వేలల్లో లైక్స్ వచ్చాయి. మైనీ కూన్ అనే పిల్లి జాతి అమెరికాకు చెందినది. ఈ జాతి పిల్లులు బాగా పొడవుగా, ఎత్తుగా పెరుగుతాయి. మినినా ప్రకారం, కెఫిర్ ఇంకా పెరుగుతుంది. పుట్టినప్పటి నుండి నాలుగు సంవత్సరాల పాటు ఈ పిల్లులు పెరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఈ జాతి పిల్లులు ఒక మీటర్ వరకూ పెరుగుతాయి. కెఫిర్ ని చూసిన చాలామంది కుక్కపిల్ల కావచ్చని అనుకుంటారని మినినా తెలియజేసింది. 2022లో కెఫిర్ బాగా ఫేమస్ అయ్యింది. మైనీ కూన్ జాతి పిల్లులు ఉండాల్సిన 18పౌండ్ల కంటే ఎక్కువ పెరిగి(28 పౌండ్లు) అందరినీ ఆశ్చర్యపరిచింది.