చలికాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులు
చలికాలం కొందరికి సంతోషాలను మిగిల్చితే మరికొందరికి నొప్పులను, శారీరక బాధలను మిగుల్చుతుంది. ఈ కాలంలో మంచి ఆహారాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరేమో రుతువు మారడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ పెద్దగా ఆనందించలేకపోతారు. రోజులు చిన్నవిగా ఉండడం వల్ల చలికాలంలో సూర్యరశ్మి సరిగ్గా అందదు. దానివల్ల మానసికంగా బలహీనమవుతారు. హార్మోన్ల స్థాయిల్లో మార్పులు సంభవించి రోజు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ కాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని పనులు చేయాలి. మీ బాడీలో నీటిశాతాన్ని తగ్గనివ్వకండి: శరీరంలో నీటిశాతం తగ్గకుండా నీళ్ళు తాగాలి. కావాలంటే ఒక కప్పు కాఫీ తాగడం కూడా మంచిదే. కాకపోతే అది ఒకటి కంటే మించరాదు.
మానసిక ఆరోగ్యం కోసం చేయాల్సినవి
నెగెటివ్ వార్తలకు దూరంగా ఉండాలి: ఈ కాలంలో ఎక్కువ టైమ్ ఇంట్లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి స్క్రీన్ టైమ్ పెరిగే అవకాశం ఉంది. సో, మీ మీద నెగెటివ్ గా ప్రభావం చూపే వార్తలను చూడకండి. అవి మీకు తెలియకుండానే మిమ్మల్ని నీరసంగా చేస్తాయి. స్వయం సంరక్షణ: శరీరానికి మాయిశ్చరైజర్ రాడటం, వేడినీళ్ళతో స్నానం చేయడం, కొంత వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్ర క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోండి. స్నేహితులతో మాట్లాడండి: మీ మనస్సును సంతోషాన్ని పంచే స్నేహితులతో మాట్లాడండి. వాళ్లతో మాట్లాడుతుంటే మీలోనూ ఉత్సాహం పెరగాలి. ఎప్పుడూ సీరియస్ విషయాలే కాకుండా కొంచెం చిల్ అవ్వండి. కనీసం 15నిమిషాల పాటు ఎండలో నిల్చోండి. దానివల్ల విటమిన్ డి దొరుకుతుంది.